గత ఐపీఎల్ సీజన్ లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబాయి ఇండియన్స్ టీమ్ లు తమ ఆట తీరుతో అదరగొట్టాయనే చెప్పాలి. కానీ ఈ ఐపీఎల్-2022 సీజన్ కు వచ్చే సరికి ఈ బలమైన జట్లే మిగత జట్లతో పోటీ పడలేక చితికిల పడుతున్నాయి. వరుసగా నాలుగోసారి ఓటమి పాలైన ఈ జట్లను చూసి ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. అయితే శనివారం తొలి మ్యాచ్ లో భాగంగా చెన్నై, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసింది. మొయిన్ అలీ 48 పరుగులతో పరవాలేదనిపించినా రాయుడు 27, జడేజా 23 పరుగులు తప్పా మిగత ప్లేయర్స్ పెద్ద ఆకట్టుకోలేకపోయారు.
ఇక అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 17.4 ఓవర్లలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరి తొలి విజయాన్ని ఖతాలో వేసుకుంది. హైదరాబాద్ ఆటగాళ్లైన అభిషేక్ శర్మ 75,కేన్ విలియమ్సన్ 32, రాహుల్ త్రిపాఠి 32 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకుని జట్టును విజయతీరానికి చేర్చారు. ఇక రెండో మ్యాచ్ లో భాగంగా బెంగుళూరు, ముంబై జట్లు తలపడగా ముంబై మరోసారి నాలుగో ఓటమిని చవి చూసింది.
ఇది కూడా చదవండి: వీడియో: నటరాజన్ సూపర్ డెలివరీ.. గైక్వాడ్‌కు దిమ్మతిరిగింది!
అయితే ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇక టీమ్ లో కీలక ఆటగాడైన సూర్య కుమార్ యాదవ్ 68 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. అనుజ్ రావత్ 66 పరుగుల చేయగా, కోహ్లీ 48 పరుగులు చేయగా 19 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఈజీగా విజయాన్ని సాధించింది బెంగుళూరు జట్టు. ఇక వరుసగా ఓటమి పాలవుతున్న చెన్నై ముంబైలను చూసి ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. నాలుగోసారి ఓటమిపాలవుతున్న ఈ రెండు బలమైన జట్లపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.