ఐపీఎల్ 2021 రెండో దశ పోటీలో నేడు(సోమవారం) రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ అబుదాబి వేదికగా జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య పోటీ టఫ్‌గా ఉండనుంది. పేపర్ మీద పేర్లు చూస్తే రెండు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. కాగా ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, కేకేఆర్ చెత్త ప్రదర్శనలు చేస్తూ ఏడో స్థానంలో ఉంది. విరాట్, డివిలియర్స్‌లలో ఏ ఒక్కరు బ్యాట్ ఝళిపించినా కానీ ఆర్సీబీకి విజయం ఈజీ. అలాగే కేకేఆర్‌ను తక్కువ అంచనా వేయలేం. ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్ ఆ జట్టు ప్రధాన బలం. వాళ్లకు తోడు నితిష్‌రాణా, బెన్ కట్టింగ్ ఉన్నారు. మరీ మీరేమనుకుంటున్నారు..? ఆర్సీబీ గెలుస్తుందా? కేకేఆర్ పోరులో నిలుస్తుందా? మీ అభిప్రాయం, ప్రిడిక‌్షన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.