మైకేల్ క్లార్క్ పరిచయం అక్కర్లేని పేరు. ఆటగాడిగా, ఆస్ట్రేలియా జట్టు సారథిగా క్రికెట్ మీద కొన్నేళ్ల పాటు తనదైన ముద్ర వేశాడు. సొగసైన బ్యాటింగ్ శైలితో అతడు కొట్టే షాట్లకు ప్రేక్షకులతో పాటు వెటరన్ ప్లేయర్లు కూడా ఫిదా అయ్యేవారు. 2015లో క్రికెట్ నుంచి క్లార్క్ సన్యాసం తీసుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతగా కొత్త కెరీర్‌ను ఆరంభించాడు. అలాంటి క్లార్క్ ఇప్పుడో వివాదంలో చిక్కుకున్నాడు. తనన మోసం చేస్తున్నాడంటూ క్లార్క్‌పై ఓ మహిళ చేయి చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. వేరేవారితో ఉంటూ తనకు మోసం చేస్తున్నట్లు గ్రహించిన క్లార్క్ గర్ల్‌ఫ్రెండ్ జేడ్ యార్బ్రో.. అతడ్ని చెంపదెబ్బలు కొట్టింది.
జేడ్ యార్బ్రోకు సర్దిచెప్పేందుకు క్లార్క్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మాజీ ప్రేయసి పిప్ ఎడ్వర్డ్‌తో కలసి క్లార్క్ తనను మోసగించాడని ఆమె తీవ్రంగా ఆరోపణలు చేసింది. ఆమెతో చేసిన చాటింగ్‌ను బయటపెట్టాలని యార్బ్రో డిమాండ్ చేసింది. ఈ ఘటనపై క్లార్క్ స్పందించాడు. ప్రజలందరికీ అతడు సారీ చెప్పాడు. ఈ ఆరోపణలతో తాను మానసికంగా కుంగిపోయానని క్లార్క్ అన్నాడు. మరోవైపు ప్రస్తుతం బీసీసీఐ కామెంటరీ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్న క్లార్క్‌ను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో భారత్, ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య జరిగే టెస్టు, వన్డే సిరీస్‌ల్లో అతడు కామెంట్రీ చేయడం కష్టమేనని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే అతడికి భారీ నష్టం జరగొచ్చు. కామెంట్రీ చేసే చాన్స్‌ను కోల్పోవడంతో పాటు డబ్బు రూపంలోనూ నష్టం కలగొచ్చు. మరి, గర్ల్‌ఫ్రెండ్‌తో క్లార్క్ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.