”టెస్ట్ మ్యాచ్ లను జనం ఎగబడి చూసేలా చేస్తాం” పాక్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ అన్న మాటలు. ఈ రోజు (డిసెంబర్ 1) అక్షరాలా నిజం అవుతోంది. పాక్-ఇంగ్లాండ్ మధ్య రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఇది టెస్ట్ మ్యాచ్ లా లేదు టీ20 మ్యాచ్ ను తలపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ చూసేవారికి ఆడేది టెస్టా? టీ20నా అనే అనుమానం కలగక మానదు. వరుసగా టాప్ 3 బ్యాటర్లు సెంచరీలు చేయడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. అదీకాక ఈ మ్యాచో లో ఓ రికార్డ్ సైతం నమోదు అయ్యింది. పాక్ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ.. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్స్ వరుసగా 6 బంతుల్లో 6 ఫోర్లు కొట్టాడు.
ఇంగ్లాండ్-పాక్ మధ్య జరుగుతున్నటెస్ట్ మ్యాచ్.. టీ20 మ్యాచ్ ను తలపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ ముగిసింది అన్న సంగతి ఇంగ్లాండ్ ఆటగాళ్లు మర్చిపోయారేమో.. అన్నట్లుగా ప్రస్తుతం బ్రిటీష్ జట్టు ఆడుతోంది. తొలిరేజే సెంచరీలతో మోత మోగించారు ఇంగ్లాండ్ బ్యాటర్లు. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ లు తొలి వికెట్ కు 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు సెంచరీలతో కదంతొక్కారు. అనంతరం వచ్చిన వికెట్ కీపర్ ఓల్లి పోప్ సైతం శతకంతో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్ లో ఓ నయా రికార్డు నమోదు అయ్యింది. ఈ మ్యాచ్ లోఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్స్.. పాక్ బౌలర్లను చీల్చిచెండాడుతున్నాడు. ఈ క్రమంలోనే కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు.
ABSOLUTE CARNAGE 🤯🔥#PAKvENG pic.twitter.com/8STZ4KLAud
— 𝘕𝘈𝘚𝘌𝘌𝘙 𝘔𝘖𝘏𝘈𝘔𝘔𝘌𝘋 🇵🇹 (@Naseer_md786) December 1, 2022
ఈ క్రమంలోనే పాక్ బౌలర్ షకీల్ వేసిన 68వ ఓవర్లో తన విశ్వరూపాన్నే చూపాడు బ్రూక్స్. ఈ ఓవర్లో ఏకంగా 6 బంతులకు 6 ఫోర్లు బాది రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న హ్యారీ బ్రూక్స్ 81 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్ లతో 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 73 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 479 పరుగులతో భారీ స్కోర్ వైపు దూసుకెళ్తోంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే (122), డకెట్(107), పోప్(108) సెంచరీలతో కదంతొక్కారు. వరల్డ్ క్లాస్ బౌలర్లుగా చెప్పుకుంటున్న పాక్ బౌలర్లు.. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ముందు తేలిపోయారు.
Harry Brook is enjoying the Rawalpindi track 🔥🔥
📸: Sony Sports pic.twitter.com/K7m7PwJWfS
— CricTracker (@Cricketracker) December 1, 2022