టీ20 వరల్డ్ కప్ 2022లో ఘోర వైఫల్యం తర్వాత.. టీమిండియా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు టీ20లు, మూడు వన్టేలు ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది భారత జట్టు. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్‌తో టీమిండియా గెలిపించాడు. ఇక నేడు(మంగళవారం) మూడో టీ20 కోసం ఇరు జట్లు నేపియర్‌లో తలపడుతున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాడు దీపక్ హుడా మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో స్థానం సంపాదించినా హుడాకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. అలాగే న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ హుడాకు స్థానం దక్కింది.
రెండో టీ20లో బ్యాట్‌తో విఫలమైన హుడా బౌలింగ్‌లో రాణించి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇక మూడో టీ20లోనూ హుడాకు తుది జట్టులో స్థానం దక్కింది. కాగా.. జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నారు? 3వ స్థానమా లేకా 5వ స్థానమా? అని ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. కచ్చితంగా 5వ స్థానంలోనే బ్యాటింట్ చేయాలనుకుంటున్నాను అని హుడా వెల్లడించాడు. అలాగే మూడో స్థానంలో లెజెండ్ బ్యాటింగ్ చేస్తాడని.. ఆ స్థానం జోలికి మనం వెళ్లకూడదని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ హుడా పేర్కొన్నాడు. అయితే.. తాను ఓ ఆల్‌రౌండర్ నని బ్యాట్‌తో సరిగా రాణించలేకపోయినా.. బౌలింగ్‌లో సత్తా చాటేందుకు తన బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు హుడా వెల్లడించాడు.
కాగా.. దీపక్ హుడాను టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసినప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. అలాగే.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కూడా ఎంపిక చేయడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. దీపక్ హుడా స్థానంలో సంజు శాంసన్‌కు తుది జట్టులో చోటు ఇవ్వాలని రెండో టీ20 నుంచే డిమాండ్ చేస్తున్నా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం దీపక్ హుడా వైపే మొగ్గు చూపాడు. ఇక రెండో టీ20లో బ్యాటింగ్ డకౌట్ అయిన బౌలింగ్ 4 వికెట్లు పడగొట్టాడు. కానీ.. మూడో టీ20లో మాత్రం కేవలం ఒక్క ఓవర్‌కే పరిమితం అయ్యాడు. ఇక ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడి మంచి ప్రదర్శన కనబర్చిన హుడాను ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌పై సెంచరీ చేయడంతో టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన విషయం తెలిసిందే.
Deepak Hooda talks about the batting position which he would like to bat on.#DeepakHooda #ViratKohli #CricketTwitter pic.twitter.com/6yMajMF0MD
— CricTracker (@Cricketracker) November 22, 2022