ఆస్ట్రేలియా.. ఈ పేరు చెప్పగానే సగటు క్రికెట్ అభిమానికి ఠక్కున గుర్తుకు వచ్చే పేరు స్లెడ్జింగ్. కానీ గత కొంత కాలంగా ఆ జట్టు తీరు మారుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న విమర్శల వల్లనో.. లేక వారిలో వచ్చిన పరివర్తనో తెలీదు కానీ ప్రస్తుతం ఆసిస్ ఆటగాళ్ల పరివర్తనలో మాత్రం చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా పరిణతి చెందినట్లు కనిపిస్తోంది. 2018 శాండ్ పేపర్ వివాదం నుంచి వార్నర్ బిహేవియర్ లో చాలా మార్పును మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో వార్నర్ తన పసిమనసును చాటుకున్నాడు. ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన వార్నర్.. అవుట్ అయ్యాక వెళ్తూ.. వెళ్తూ.. ఓ బుడతడికి గిఫ్ట్ ఇచ్చి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
డేవిడ్ వార్నర్.. సొంత గడ్డపై జరిగిన టీ20 ప్రపంచ కప్ లో దారుణంగా విఫలం అయ్యాడు. దాంతో ఇంటా బయట విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక ఈ విమర్శలన్నింటికీ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడీ డాషింగ్ ఓపెనర్. ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో దుమ్ము రేపుతున్నాడు డేవిడ్ భాయ్. తొలి వన్డే లో 86 పరుగులు చేసి జట్టును గెలిపింపించిన వార్నర్.. రెండో వన్డేలో సైతం చెలరేగాడు. ఏకంగా సెంచరీ కొట్టి, ఆసిస్ కు భారీ స్కోరును అందించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేషం చోటు చేసుకుంది. వార్నర్ అవుట్ అయ్యి డ్రస్సింగ్ రూమ్ కు వెళ్తున్న క్రమంలో.. పెవీలియన్ దగ్గర కొందరు చిన్నారులు వార్నర్ కు చేతులు అందించడానికి చేతులు చాచారు.
ఈ క్రమంలోనే వారి దగ్గరగా వచ్చిన వార్నర్ ఓ బుడతడికి తన చేతి గ్లౌజ్ లను ఇచ్చాడు. ఇక ఆ గ్లౌజ్ లను అందుకున్న ఆ బుడతడు స్పీడ్ గా వాళ్ల అమ్మ దగ్గరకు పరిగెత్తుకెళ్లాడు. వాటిని వాళ్ళ అమ్మకు అందించి తెగ సంబరపడిపోయాడు. ఆ పిల్లాడి ఆనందానికి అంతేలేదు. తన సొదరుడు సైతం గ్లౌజ్ లను పట్టుకుని నవ్వులు చిందించాడు. ఆమె సైతం ఆ గ్లౌజ్ లను చూస్తూ తెగ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా ఆటగాళ్లు చిన్నారులకు ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటారు. గతంలో బాల్ తాకి గాయపడిన చిన్నారికి రోహిత్ గిఫ్ట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అప్పుడప్పుడూ ఆటగాళ్లు తమ పసిమనసులను తెలియజేస్తూ.. ఇలా చిన్నారులకు ఏదో ఒకటి ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.
Great gesture from David Warner, champion. pic.twitter.com/yzUXBNO9XB
— Johns. (@CricCrazyJohns) November 22, 2022
🌟 David Warner – 106 (102)
🌟 Travis Head – 152 (130)Outstanding innings from both the Australian openers come to an end.@davidwarner31 | @travishead34 | #AUSvENG pic.twitter.com/HQumLRwYq9
— CricTracker (@Cricketracker) November 22, 2022