75th Independence Day: తెల్ల దొరల బానిసత్వం సంకెళ్లు తెంచుకుని.. భారతమాత స్వాతంత్య్రం పొందిన రోజు ఇది. రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలకుల బానిసత్వం నుంచి బయటపడిన రోజు ఇది. ఎందరో సమరయోధుల ప్రాణత్యాగాలు.. పోరాటల ఫలితంగా 1947వ సంవత్సరం, ఆగస్టు 15న మనం ఈ స్వాతంత్య్రన్ని సాధించకున్నాం. ఈ నేపథ్యంలో ఆ మహానుభావులను స్మరిస్తూ.. వారికి మనసారా నివాళులు అర్పిస్తూ.. సగర్వంగా ఈ పంద్రాగస్టు వేడుక జరుపుకుంటాం.
నేటితో దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా దేశం మొత్తం మువ్వన్నెల పతాకం రెపరెపలు ఆకాశన్నంటాయి. ఈ క్రమంలో పలువురు విదేశీ క్రికెటర్లు భారత దేశానికి, భారత క్రికెట్ అభిమానులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ’76వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇండియా.. అత్యంత ప్యాషన్ కలిగిన అభిమానులు మీరు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా మా అందరి నుంచి శుభాకాంక్షలు’’ అని డుప్లెసిస్ ట్వీట్ చేశాడు. అతనితోపాటు జాస్ బట్లర్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్, న్యూజిల్యాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తదితరులు భారత ప్రజలు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Happy 75th #Independence day India!
You are my special home away from home.
Congratulations on #75NotOut from all of us.@BCCI @IPL @Dream11 @josbuttler @jbairstow21 #kanewilliamson @ABdeVilliers17 @KagisoRabada25 pic.twitter.com/pVyp83f5H4— Faf Du Plessis (@faf1307) August 15, 2022
ఇదీ చదవండి: దేశం పేరు మార్చండి! ప్రధాని మోదీకి షమీ మాజీ భార్య రిక్వెస్ట్
ఇదీ చదవండి: అతను చెప్పేంత వరకు సచిన్ గురించి నాకు తెలియదు: అక్తర్