బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్ తో జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత్ దీటుగా జవాబు ఇస్తోంది. ఇక మూడో రోజు మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుంది. విరాట్ కోహ్లీకి చేతులెత్తి దండం పెట్టాడు యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్ తో జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత్ దీటుగా జవాబు ఇస్తోంది. ఇక మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. జట్టులో యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ (128) సెంచరీతో కదం తొక్కగా.. కోహ్లీ 59 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అయితే మూడో రోజు మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుంది. విరాట్ కోహ్లీకి చేతులెత్తి దండం పెట్టాడు యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్. ఎందుకంటే?
విరాట్ కోహ్లీ.. టీమిండియా రన్ మెషిన్ గా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఆసిస్ తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మాత్రం ఘోరంగా విఫలం అవుతున్నాడు. తాజాగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఆర్దశతకంతో టచ్ లోకి వచ్చాడు విరాట్. ఈ క్రమంలోనే మూడో రోజు భారత బ్యాటర్లు అయిన పుజారా-గిల్ లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. డగౌట్ లో విరాట్, ఇషాన్ కిషన్, రాహుల్, సూర్యలు ఉన్నారు. అప్పుడు విరాట్ కోహ్లీ.. పిచ్ గురించి ఇషాన్ కిషన్ తో డీప్ డిస్కషన్ పెట్టాడు. పుజారా బ్యాటింగ్, పిచ్ కండిషన్ పై ఇషాన్ కిషన్ కు పాఠాలు చెప్పాడు. అప్పటికే ఫ్యాడ్స్ కట్టుకుని రడీగా ఉన్నాడు కోహ్లీ.
ఈ క్రమంలోనే పుజారా అవుట్ కావడంతో.. బరిలోకి దిగాడు విరాట్. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ 128 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతో 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక కోహ్లీ అర్ధశతకం సాధించగానే ఇషాన్ కిషన్ డగౌట్ నుంచి చేతులెత్తి విరాట్ కు మెుక్కాడు. డగౌట్ లో ఈ రోజు తాను దుమ్ములేపుతాను అని ఇషాన్ కు చెప్పినట్లున్నాడు విరాట్. దాంతో అన్న మాట నిలబెట్టుకున్నందుకు చేతులెత్తి మెుక్కాడు ఇషాన్ అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఇషాన్ చేతులెత్తి విరాట్ ను మెుక్కిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. జట్టులో రోహిత్(35), శుభ్ మన్ గిల్(128) సెంచరీ చేయగా.. పుజారా(42), విరాట్ కోహ్లీ(59*), జడేజా(16*) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక ఆసిస్ తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
Funny moment between Kohli & Ishan. pic.twitter.com/w0UtD06Pr1
— Johns. (@CricCrazyJohns) March 11, 2023