యూనివర్సల్ బాల్ క్రిస్ గేల్ బ్యాటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారు. కానీ.. కొంతకాలంగా అతని బ్యాటింగ్‌ను మిస్ అవుతున్నారు. గతేడాది ఐపీఎల్‌లో కూడా ఆడకపోవడంతో.. గేల్ సునామీని మిస్ అవుతున్నారు. ఆ లోటును పూడుస్తూ.. గేల్ కర్ణాటకలో దుమ్మురేపాడు.
విధ్వంస బ్యాటింగ్‌కు మారుపేరైన క్రిస్ గేల్ చాలా కాలం తర్వాత ఇండియాలో తన బ్యాట్‌ను ఝుళిపించాడు. 2021 వరకు ఐపీఎల్‌ను ఆడిన గేల్.. 2022 సీజన్‌లో మాత్రం పాల్గొనలేదు. కరోనా కారణంగా బయోబబుల్‌లో అన్ని రోజులు ఉండలేక గేల్ ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్‌ల్లో గేల్ మెరుపులను మిస్ అయ్యారు. అయితే.. చాలా రోజుల తర్వాత గేల్ పవర్ హిట్టింగ్‌ను కళ్లరా చూసే అదృష్టం కర్టాటక క్రికెట్ అభిమానులకు దక్కింది. ఫోర్లు, సిక్సులతో గేల్ విరుచుకుపడుతుంటే.. కన్నడ ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.
కన్నడ చలనచిత్ర కప్ 2023లో పాల్గొన్న గేల్.. తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపాడు. కన్నడ హీరో కిచ్చా సుదీప్ కెప్టెన్‌గా ఉన్న హుయసల ఈగల్స్ టీమ్ తరఫున బరిలోకి దిగిన గేల్.. శుక్రవారం బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వడయార్ ఛార్జర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గేల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 23 బంతుల్లోనే 59 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో.. హుయసల జట్టు 106 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలో ఛేదించింది.
సినీ తారలు, అంతర్జాతీయ మాజీ క్రికెటర్ల కలయికలో ఈ కన్నడ చలనచిత్ర కప్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో క్రిస్ గేల్‌తో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా, వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా, అలాగే శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్షాన్ సైతం ఈ లీగ్‌లో వివిధ జట్లకు ఆడుతున్నారు. సినిమా హీరోలతో పాటు క్రికెట్‌స్టార్లు సైతం ఈ లీగ్‌లో ఆడుతుండటంతో ఈ లీగ్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. కిచ్చా సుదీప్‌తో పాటు శివరాజ్‌కుమార్‌తో పాటు మరికొంత మంది పెద్ద హీరోలు ఈ లీగ్‌లో ఆడుతున్నారు. సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ లీగ్‌లో ఆడుతున్నారు. మరి క్రిస్ గేల్ బ్యాటింగ్ సునామీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Chris Gayle smashed 59* from just 23 balls in the KCC tournament to help the Kiccha Sudeep team win their first match in the tournament. pic.twitter.com/Yek1dVTIEx
— Johns. (@CricCrazyJohns) February 24, 2023