జూన్ 7 న భారత్- ఆస్ట్రేలియా మధ్య లండ లోని ఒవెల్ లో డబ్ల్యూటీసి ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్ కి సంబంధించి దిగ్గజాలు తమ విశ్లేషణతో పాటు కీలక సలహాలు కూడా ఇస్తున్నారు. తాజాగా భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా భారత్ గెలవాలంటే ఒక కీలకమైన సలహా ఇచ్చేసాడు.
అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రానే వస్తుంది. జూన్ 7 న జరగబోయే ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. లండన్ లోని ఓవల్ ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుంది. ఇప్పటికే ఐపీఎల్ ముగించుకొని భారత ఆటగాళ్లు లండన్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఎవరు గెలిచినా.. వారి ఖాతాలోకి మొదటిసారిగా టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ చేరబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ మొదలెట్టేసారు. అయితే ఇప్పుడు ఈ ఫైనల్ కి సంబంధించి దిగ్గజాలు తమ విశ్లేషణతో పాటు కీలక సలహాలు కూడా ఇస్తున్నారు. తాజాగా భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా భారత్ గెలవాలంటే ఒక కీలకమైన సలహా ఇచ్చేసాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ తో పోల్చుకుంటే ఆస్ట్రేలియా జట్టు ఫేవరేట్ గా కనబడుతుంది. ఇంగ్లాడ్ పిచ్ లు మీద ఎక్కువ మ్యాచులు ఆడిన అనుభవం ఆసీస్ కి కలిసి వస్తుందనే చెప్పాలి. మరోవైపు భారత్ కి కూడా ఈ టెస్టు మ్యాచ్ కి ఇప్పటివరకు సరైన ప్రాక్టీస్ కూడా లేదు. దాదాపు రెండు నెలలపాటు ఐపీఎల్ అంటూ టీ 20 లు ఆడిన టీమిండియాకు ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో రాణించడం అంత సామాన్యమైన విషయం కాదు. పైగా.. బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి స్టార్ క్రికెటర్లు కూడా గాయాల కారణంగా అందుబాటులో ఉండడం లేదు. అయితే పుజారా ఇంగ్లాండ్ కౌంటీ ఆడుతూ మంచి ఫామ్ లో ఉండడం భారత్ కి కొంచెం ఊరట కలిగిస్తుంది. ఇదే విషయంపై గవాస్కర్ మాట్లాడుతూ పుజారా సలహాలు తీసుకోవాల్సిందిగా భారత్ కి సూచించాడు.
గవాస్కర్ మాట్లాడుతూ.. “పుజారా గడిచిన రెండు నెలలుగా ఇంగ్లాండ్ లో ఉంటున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ లో సెంచరీల వర్షం కురిపిస్తున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరిగే ది ఓవల్ లో అతడు ఆడకపోయినా.. పుజారా ప్రాతినిథ్యం వహించే సస్సెక్స్ టీమ్ ఆడే మ్యాచ్ లు ఇక్కడికి దగ్గరగానే జరిగాయి. ఇక్కడి పరిస్థితులపై పుజారాకు అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు తన తోటి బ్యాటర్లకు అతడు చెప్పే పాఠాలు ఎంతో విలువైనవి. ఈ సీజన్ లో పుజారా సస్సెక్స్ లో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తో కూడా కలిసి ఆడాడు. అతడిని ఔట్ చేసేందుకు వ్యూహాలు రూపొందించడంలో పుజారా కీలకం”..’అని తెలిపాడు. మరి గవాస్కర్ చెప్పినట్లుగానే పుజారా సలహాలు టీమిండియాకు ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.