జిడ్డు బ్యాటింగ్ కు మారుపేరైన చతేశ్వర్ పుజారా.. ఆసిస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఓ భారీ సిక్సర్ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఆ సిక్స్ ను చూసి రోహిత్ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండు టెస్ట్ మ్యాచ్ లు గెలిచి సిరీస్ లో 2-0తో ముందంజలో ఉంది టీమిండియా. ఇక ఇండోర్ వేదికగా తాజాగా జరుగుతున్న మూడో టెస్ట్ లో మాత్రం భారత్ తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో సైతం 163 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి ఓటమి వైపు పయనిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో టెస్ట్ బ్యాటింగ్ కు మారుపేరైన చతేశ్వర్ పుజారా ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ సిక్సర్ చూసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
చతేశ్వర్ పుజారా.. టీమిండియా నయా వాల్ గా పేరుగాంచిన ఈ స్టార్ ప్లేయర్ గత కొంత కాలంగా విఫలం అవుతూ వస్తున్నాడు. ఇక తాజాగా ఆసిస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో అర్ద సెంచరీతో చెలరేగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా గానీ మెుక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేశాడు. 142 బంతులు ఎదుర్కొన్న పుజారా 5 ఫోర్లు, ఓ భారీ సిక్స్ తో 59 పరుగులు చేసి మరోసారి లయోన్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. స్మిత్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయ్యాడు పుజారా.
అయితే జిడ్డు బ్యాటింగ్ కు మారుపేరుగా నిలిచే పుజారా బ్యాట్ నుంచి సిక్సర్లు ఊహించడం కష్టమే. ప్రేక్షకులు సైతం పుజారా నుంచి సిక్సులు ఊహించరు. కానీ ఈ మ్యాచ్ లో నాథన్ లయోన్ బౌలింగ్ లో ముందుకు వచ్చి ఓ భారీ సిక్స్ కొట్టాడు. దాంతో ఆ సిక్స్ ను చూసిన రోహిత్ శర్మ గట్టిగా అరుస్తు రియాక్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక జిడ్డు బ్యాటింగ్ ఆడే పుజారా నుంచి ఇంత భారీ సిక్స్ రావడం విశేషం అనే చెప్పాలి. మరి పుజారా భారీ సిక్స్ బాదడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) March 2, 2023