జింబాబ్వే మాజీ క్రికెటర్ బ్రెండన్ టేలర్ సంచలన విషయాలను బయటపెట్టాడు. భారతదేశానికి చెందిన ఓ వ్యాపారవేత్త తనను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడమని బెదిరించాడని వెల్లడించాడు. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ బుకీ నుంచి డబ్బులు కూడా తీసుకున్నట్టు తెలిపాడు. ఈ మేరకు సదరు విషయాన్ని టేలర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.
ఇది కూడా చదవండి : WI vs EN: ఆఖరి ఓవర్ లో హై టెన్షన్! ఇదెక్కడి మాస్ ఛేజింగ్?
2019 లో భారత్‌కు చెందిన వ్యాపారవేత్త ఆహ్వానం మేరకు భారతదేశానికి వచ్చినట్టు బ్రెండన్ టేలర్ తెలిపాడు. ఆ సందర్భంగా వ్యాపారవేత్త ఇచ్చిన పార్టీలో పాల్గొన్నట్లు చెప్పాడు. ఆ పార్టీలో సదరు వ్యక్తులు తనకు నిషేధిత కొకైన్ ఇచ్చినట్లు తెలిపిన అతను, ఆ సమయంలో వారు తనకు తెలియకుండా కొకైన్ తీసుకుంటుండగా వీడియో తీసినట్టు చెప్పుకొచ్చాడు.ఈ వీడియోను చూపించి అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని బెదిరించారని టేలర్ వివరించాడు. ఒకే వేళ తాను ఫిక్సింగ్‌కు పాల్పడకుంటే ఆ వీడియోను బయటికి విడుదల చేస్తామని బెదిరించినట్లు తెలిపాడు.
To my family, friends and supporters. Here is my full statement. Thank you! pic.twitter.com/sVCckD4PMV
— Brendan Taylor (@BrendanTaylor86) January 24, 2022
భారత వ్యాపారవేత్త తమ దేశమైన జింబాబ్వేలో టీ20 లీగ్‌ను ప్రారంభించినున్నట్లు చెప్పాడని బ్రెండన్ టేలర్ వెల్లడించాడు. అప్పటికీ తమ దేశ క్రికెట్ బోర్డు నుంచి ఆరు నెలలుగా జీతాలు అందలేదని చెప్పాడు. దీంతో తన ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకోని ప్రలోభాలకు దిగడమే కాకుండా బెదిరింపులకు దిగారని తెలిపాడు. అప్పుడు తనకు 15 వేల అమెరికా డాలర్లు ఆఫర్ చేశారని చెప్పాడు. మరో దారి లేకపోవడంతో కొంత డబ్బు కూడా తీసుకున్నట్లు టేలర్ తెలిపాడు. గత రెండేళ్లుగా ఈ భారాన్ని మోయలేక మానసికంగా, శారీరకంగా కృంగిపోయానని, అందుకే ప్రస్తుతం ఈ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశానని వెల్లడించాడు. ఈ విషయాన్ని ప్రస్తుతం ఐసీసీ కి కూడా తెలియజేసినట్లు చెప్పుకొచ్చాడు. అందుకు పర్యావసనంగా ఐసీసీ విధించే నిషేధాన్ని ఎదుర్కొడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే వ్యాపారవేత్త పేరును మాత్రం టేలర్ వెల్లడించలేదు ఈ మాజీ క్రికెటర్.
35 ఏళ్ల బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గత ఏడాదే వీడ్కోలు పలికాడు. జింబాబ్వే తరఫున అత్యధికంగా 17 సెంచరీలు చేసిన రికార్డు కూడా టేలర్ పేరు మీదనే ఉంది. 34 టెస్టుల్లో 36 సగటుతో 2320 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 205 వన్డేల్లో 35 సగటుతో 6684 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా 44 టీ20ల్లో 22 సగటుతో 859 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 2014 సీజన్ ఆడాడు బ్రెండన్ టేలర్.
Brendon Taylor says a sponsorship deal in India resulted in extortion against him after he did cocaine.
Read a similar story of how a cricketer is trapped into match fixing in my book ‘The Fixer’ – https://t.co/2aXaZq8lgK#Cricket #Reading #Thriller pic.twitter.com/EbcsTwYopA— Suman Dubey (@sumandubey) January 26, 2022