రెండో టెస్టులో స్టార్టయిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సిరాజ్ గాయపడ్డాడు. వేలి నుంచి రక్తం కూడా వచ్చింది.
దిల్లీ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభమైపోయింది. టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. అయితే నాగ్ పూర్ జరిగిన తొలి టెస్టులో కంగారూ జట్టు ఘోరంగా ఓడిపోయింది. స్పిన్ కు అనుకూలించిన ఆ పిచ్ పై తొలుత మన పేసర్లు చెలరేగి వికెట్లు తీయగా.. ఆ తర్వాత స్పిన్నర్స్ ప్రత్యర్థి బ్యాటర్ల నడ్డి విరిచేశారు. దీంతో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ ఆసీస్ క్రికెటర్లు సరిగా ఆడలేకపోయారు. అదే పిచ్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తొలి టెస్టులో ఓటమితో బాగా ప్రాక్టీస్, కొత్త ప్లాన్స్ వేసుకున్న ఆస్ట్రేలియా జట్టు.. రెండో టెస్టులో తొలిరోజు బాగానే ఆడుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే భారత బౌలర్ సిరాజ్ గాయపడ్డాడు. వేలి నుంచి రక్తం కూడా కారింది. అయితే తాను మధ్యలో వెళ్తే సమస్య అవుతుందని, మైదానంలో వేలికి బ్యాండేజ్ చుట్టుకుని, ట్రీట్ మెంట్ తీసుకుని వెంటనే బౌలింగ్ చేశాడు. ఇది చూసిన పలువురు క్రికెట్ అభిమానులు సిరాజ్ ని ప్రశంసిస్తున్నారు. ట్రూ హీరో అని ఆకాశానికెత్తేస్తున్నారు.
ఇదిలా ఉండగా తొలి టెస్టు ఆడిన జట్టుతోనే టీమిండియా, ఈ మ్యాచ్ లోనూ బరిలోకి దిగింది. సూర్య కుమార్ యాదవ్ బదులు శ్రేయస్ అయ్యర్ ను తీసుకుంది. మరోవైపు వరసగా అన్ని ఫార్మాట్లలోనూ విఫలమవుతున్నాసరే కేఎల్ రాహుల్ కు ఛాన్సులిస్తుండటంపై నెటిజన్స్ విమర్శిస్తున్నారు. అతడికి బదులు గిల్, సర్ఫరాజ్, కరుణ్ నాయర్ లాంటి బ్యాటర్లకు అవకాశాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే.. గాయమైనా సరే ఏ మాత్రం భయపడకుండా సిరాజ్ తిరిగి బౌలింగ్ చేయడంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Mohammad Siraj’s finger injured and bleeding as well and gets a treatment and now he bowling again.
Mohammad Siraj – What a fighter! pic.twitter.com/WAKlIx98dW
— CricketMAN2 (@ImTanujSingh) February 17, 2023