ఇండియన్ క్రికెటర్లలో తనదైన బౌలింగ్ స్టైల్ తో ఆకటుకున్నాడు భువనేశ్వర్ కుమార్. క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపు నుంచి ఆడుతున్నాడు.
ఇటీవల స్టార్ క్రికెటర్స్ క్రీడా మైదానంలోనే హీరోలు అనిపించుకోవడమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు, తమ అభిమానులు ఇబ్బందుల్లో ఉన్నా..చనిపోయినా వారి కుటుంబాలను ఆదుకుంటున్నారు. గతంలో స్టార్ కెటర్ రవీంద్ర జడేజా, ఆయన భార్య రివాబా తమ కూతురు పుట్టిన రోజు సందర్భంగా నిరుపేద కుటుంబాలోని అమ్మాయిల పేర్ల మీద బ్యాంకులో ఖాతా తెరిపించి, ఒక్కొకరి ఖాతాలో రూ.10 వేలు డిపాజిట్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టీమ్ ఇండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి గొప్ప మనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
ఒకప్పుడు టీమ్ ఇండియాలో తన బౌలింగ్ తో మైదానంలో బ్యాట్‌మెన్స్ కి చుక్కులు చూపించాడు భువనేశ్వర్ కుమార్. 2017లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని నూపూర్ నగర్‌ను వివాహం చేసుకున్నాడు.. వీరికి అక్సా అనే పాప ఉంది. తాజాగా భువనేశ్వర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఓ గురుకుంలో పేద విద్యార్థుల చదువు కోసం రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. గురుకుంలో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువు చదవాలనే ఆకాంక్ష ఉంటుంది.. వారు ఉన్నత చదువులు చదివాలనే ఉద్దేశంతో ఈ డబ్బును విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇక భువనేశ్వర్ కుమార్ ఇలాంటి సహాయం చేయడం ఇది తొలిసారి ఏమీకాదు.. 2013 లో ఉత్తరాఖండ్ లో పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తినపుడు తన వంతు సహాయం చేశాడు. ఇటీవల తన ఆటతీరు కాస్త పేలవంగా కొనసాగిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న భువనేశ్వర్ 14 మ్యాచ్ ల్లో 16 వికెట్లు తీశారు. ప్రస్తుతం భూవీ గురుకుల ఆశ్రమానికి రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.