రంజీల్లో గత మూడు సీజన్లు చూసుకుంటే అత్యంత నిలకడగా రాణించాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ ముంబై బ్యాటర్ సగటు 100 కి పైగానే ఉంది. ఇన్ని పరుగులు చేసినా కూడా టీంఇండియాలో చోటు దక్కకపోవడం నిజంగా దురదృష్టకరం. అయితే తాజాగా బీసీసీఐ సర్ఫరాజ్ ఖాన్ ని ఎందుకు సెలక్ట్ చేయలేదో ఒక క్లారిటీ ఇచ్చేసింది.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇటీవలే భారత టెస్టు జట్టుతో పాటు, వన్డే జట్టుని కూడా సెలక్టర్లు ప్రకటించేశారు. నయావాల్ పుజారా మీద వేటు వేసి ఆ స్థానంలో కొత్త కుర్రాళ్ళు అయినటువంటి జైస్వాల్, గైక్వాడ్ కి చోటు కల్పించారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి కంటే రంజీల్లో నిలకడగా రాణిస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. అయినప్పటికీ సర్ఫరాజ్ ని పట్టించుకోలేదు సెలెక్టర్లు. ఈ నేపథ్యంలో ఈ సెలెక్షన్ విధానంపై టీమిండియా దిగ్గజాలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. దీంతో సర్ఫరాజ్ ఖాన్ కి అన్యాయం జరుగుతుంది అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా బీసీసీఐ సర్ఫరాజ్ ఖాన్ ని ఎందుకు సెలక్ట్ చేయలేదో ఒక క్లారిటీ ఇచ్చేసింది. సర్ఫరాజ్ ని పక్కన పెట్టడానికి వేరే కారణం ఉందని చెప్పుకొచ్చింది.
రంజీల్లో గత మూడు సీజన్లు చూసుకుంటే అత్యంత నిలకడగా రాణించాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ ముంబై బ్యాటర్ సగటు 100 కి పైగానే ఉంది. ఇప్పటివరకు 34 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడిన సర్ఫరాజ్.. 3175 పరుగులు చేసాడు. ఇన్ని పరుగులు చేసినా కూడా టీంఇండియాలో చోటు దక్కకపోవడం నిజంగా దురదృష్టకరం. టీంఇండియాలో కాంపిటీషన్ విపరీతంగా ఉన్న కారణంగా టెస్టుల్లో అతనికి చోటు రాలేదని ఇన్ని రోజులు అందరూ భావించారు. కానీ పుజారా మీద వేటు వేసిన సెలెక్టర్లు ఆ స్థానంలో తనకంటూ తక్కువగా యావరేజ్ ఉన్న జైస్వాల్, గైక్వాడ్ కి చోటు దక్కడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ బాగా ఆడిన ప్లేయర్లకు టెస్టు జట్టులో సెలెక్ట్ అవుతున్నారు అని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా బీసీసీఐ రంగంలోకి దిగి దీనిపై వివరణ ఇచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ ని ఎంపిక చేయకపోవడానికి అతని ఫిట్ నెస్, ప్రవర్తనే కారణమంటుంది.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. “దేశవాళీలో నిలకడగా ఆడుతూ మూడు సీజన్లుగా 900 కు పైగా పరుగులు చేసిన ఆటగాడిని జాతీయ జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి సెలక్టర్లు ఏమైనా పిచ్చోళ్లా..? సర్ఫరాజ్ ని ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం ఫిట్నెస్ ఒకటి. ఈ విషయాన్ని అతడు మెరుగుపరుచుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ఈ ఫిట్ నెస్ సరిపోదు. బరువు తగ్గి ఫిట్నెస్ సాధించటానికి సర్ఫరాజ్ ప్రయత్నించాలి. ఇక ఆన్ ఫీల్డ్ లో సర్ఫరాజ్ ప్రవర్ధన కూడా మరో కారణం. సెంచరీ చేసాక తొడ కొట్టడాలు, విచిత్ర విన్యాసాలు చేయడం లాంటివి మానుకోవాలి. కేవలం పరుగులు ఒక్కటి చేస్తే సరిపోదు. అంతర్జాతీయ క్రికెట్ లోకి రావాలంటే అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పుకొచ్చారు. మరి బీసీసీఐ చెప్పిన ఈ కారణాలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.