ఫ్రాంచైజ్ క్రికెట్ లీగ్స్‌లో ఐపీఎల్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న లీగ్.. బిగ్‌బాష్. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ లీగ్‌లో భారత క్రికెటర్లు తప్ప మిగతా అన్ని దేశాల ఆటగాళ్లు పాల్గొంటారు. 8 జట్ల మధ్య సాగే బిగ్‌బాష్ లీగ్‌లో టైటిల్ కోసం హోరాహోరీ పోటీనే ఉంటుంది. అయితే.. ఈ టోర్నీలో ఒక విషయంలో మాత్రం గల్లీ క్రికెట్ స్టైల్‌ను ఫాలో అవుతారు. అదే ‘బ్యాట్ ఫ్లిప్ టాస్’. సాధారణంగా క్రికెట్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేయాలన్నా.. ఫీల్డింగ్ ఎంచుకోవాలన్నా.. ఒక కాయిన్‌తో టాస్ వేస్తారు. టాస్ గెలిచిన వారు.. పిచ్ పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగో, ఫీల్డింగో ఎంచుకుంటారు. కొన్ని మ్యాచ్‌ల్లో అయితే.. టాస్ చాలా కీలకంగా మారుతుంది. టాస్ గెలిచిన టీమ్.. మ్యాచ్ గెలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పిచ్ కండీషన్‌ను బట్టి టాస్ కొన్ని సార్లు గెలుపోటములను డిసైడ్ చేస్తుంది. అందుకే.. క్రికెట్‌లో టాస్ ఎంతో కీలకం.
అయితే.. బిగ్‌బాష్‌లో మాత్రం కాయిన్‌తో టాస్ వేయరు. మరీ.. ఏ టీమ్ ముందు బ్యాటింగ్ చేయాలో? ఫీల్డింగ్ చేయాలో? అనేది ఎలా నిర్ణయిస్తారు? అని డౌటానుమానం పడకండి. బ్యాట్ ఫ్లిప్‌తో టాస్ వేసి నిర్ణయిస్తారు. ఇదేం.. బిగ్‌బాష్ లీగ్ వాళ్లు కనిపెట్టింది కాదులేండి. గల్లీ క్రికెట్ నుంచి కాపీ కొట్టిందే. క్రికెట్ ఆడేందుకు వచ్చిన వారి వద్ద చిల్లర పైసలు లేకుంటే.. గల్లీ క్రికెటర్లు చేసే పనినే బిగ్‌బాష్ వాళ్లు ఫాలో అవుతున్నారు. గల్లీ క్రికెట్‌లో బ్యాట్‌ను గాల్లోకి విసిరి.. ఫ్రంట్, బ్యాక్‌గా టాస్ వేస్తారు, లేదా రెండు వైపుల కాస్త ఫ్లాట్‌గా ఉన్న చిన్న రాయిని తీసుకుని తడి, పొడితో టాస్ వేస్తారు. అలాగే.. చేతి బొటన వేలికి, చూపుడు వేలికి మధ్య చిన్న రాయి పెట్టి.. గిరాగిరా తిప్పి.. అక్కడ రాయి ఉందా లేదా? అని అడిగి కూడా బ్యాటింగ్ చేయాలా? ఫీల్డింగ్‌కు వెళ్లాలా అనేది డిసైడ్ చేస్తారు.
ఇలాంటి గల్లీ క్రికెట్ టాసుల్లో ఒకటైన బ్యాట్ ఫ్లిప్‌ను ఎంచుకున్న బిగ్‌బాష్ నిర్వాహకులు.. క్రికెట్‌లో 140 ఏళ్లకు పైబడిన ‘కాయిన్ టాస్’ సాంప్రదాయాన్ని బద్దలుకొడుతూ.. 2018-19 బిగ్‌బాష్ సీజన్‌లో కాయిన్ టాస్ స్థానంలో బ్యాట్ ఫ్లిప్‌ను తీసుకొచ్చారు. కాయిన్ టాస్‌పై క్రికెట్ అభిమానులకు బోర్ కొట్టిందని.. వారిలో మ్యాచ్‌కు ముందు జరిగే టాస్‌పై కూడా ఆసక్తి కలిగించేందుకు ఈ బ్యాట్ ఫ్లిప్ టాస్‌ను బిగ్‌బాష్‌లో ప్రవేశపెట్టినట్లు బిగ్‌బాస్ నిర్వాహకులు అప్పట్లో వెల్లడించారు. ఈ బ్యాట్ ఫ్లిప్ టాస్ ఆస్ట్రేలియా గల్లీ క్రికెట్‌లో తరతరాలుగా వాడుతున్నదే.. దాన్ని మేము కొత్తగా ఏమి కనిపెట్టలేదని కూడా పేర్కొన్నారు. అయితే.. బిగ్‌బాష్‌లో వేసే ఈ బ్యాట్ ఫ్లిప్ టాస్‌ను సాధారణంగా క్రికెట్ ఆడే బ్యాట్‌తో వేయరు. ఆ బ్యాట్‌తో వేసే ఎక్కువగా ఒక వైపే పడే అవకాశం ఉంది. అందుకే.. రెండు వైపుల ఫ్లాట్‌గా ఉండే బ్యాట్‌ను పోలిన చెక్కబ్యాట్‌ను తీసుకుని.. దానిపై ఒక వైఫు ఫ్లాట్, మరోవైపు రూఫ్ లేదా హీల్స్ అని రాసి.. టాస్ వేస్తారు. మరి ఈ బ్యాట్ ఫ్లిప్ టాస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Big Bash League will be replacing the coin toss with a “bat flip” in its upcoming 2018-19 edition. #BBL pic.twitter.com/sm82eIPriA
— Circle of Cricket (@circleofcricket) December 11, 2018
‘Bat Flip’ the new toss! The 141-year-old tradition of toss of coin to decide who gets to bat or bowl was substituted by ‘Bat Flip’ in the Big Bash League.
The evolving game of Cricket always sees some arrival of new concepts in Leagues. Innovation is all that matters in the game pic.twitter.com/Dy7Kw1QZfA— The Cricket Administrator (@TheCricAdmin) December 21, 2018