బాబర్ ఆజామ్ ఒక స్ట్రోక్ ప్లేయర్. భారీ సిక్సర్లు బాధలేకపోయినా భారీ ఇన్నింగ్స్ లు ఆడగల సమర్థుడు. అలాంటి బాబర్ ఆజామ్ 6 బంతుల్లో 6 సిక్సలు బాదాడంటే పాక్ అభిమానులే నమ్మట్లేరు.. కానీ అది వాస్తవమే అంటున్నాడు ఓ పాక్ అభిమాని. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు.
‘6 బంతుల్లో 6 సిక్సర్లు‘.. ఈ రికార్డు ఏ బ్యాటర్ సమం చేసినా అందరకీ గుర్తొచ్చేది.. భారత మాజీ క్రికెటర్ యువరాజ సింగే. 2007 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో యువరాజ్ ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19 ఓవర్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. ఆ తరువాత చాలా మంది క్రికెటర్లు ఈ ఫీట్ ను అందుకున్నారు. తాజగా, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కూడా ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. కాకుంటే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అదేంటన్నది ఇప్పుడు చూద్దాం..
పాక్ సారధి బాబర్ ఆజామ్ ఒక స్ట్రోక్ ప్లేయర్. భారీ సిక్సర్లు బాధలేకపోయినా భారీ ఇన్నింగ్స్ లు ఆడగల సమర్థుడు. అయితే.. నేడు 6 బంతుల్లో 6 సిక్సలు బాది తాను పవర్ హిట్టర్ అని నిరూపించుకున్నాడు బాబర్ ఆజామ్. కాకుంటే అతడు ఈ ఘనత సాధించింది.. అంతర్జాతీయ మ్యాచ్ కాదు.. లీగ్ మ్యాచ్ అంతకన్నా కాదు.. అదొక ప్రాక్టీస్ మ్యాచ్. నేటి నుంచి పాక్ వేదికగా పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తన్స్, లాహోర్ కాలెండర్స్ జట్లు తలపడనుండగా, రేపటి మ్యాచులో బాబర్ ఆజామ్ నాయకత్వం వహిస్తున్న పెషవార్ జల్మీ జట్టు కరాచీ కింగ్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన బాబర్ ఆజామ్ ఒకే ఒవర్‌లో ఆరు సిక్సర్లు బాదాడు. అందుకు సంబంధించిన వీడియోను ఫరీద్ ఖాన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది.
అయితే.. బాబర్ ఆజామ్ 6 సిక్సర్లు బాదాడంటే పాక్ అభిమానులు కూడా నమ్మట్లేరు. అతని ఆరు బౌండరీలను ఆశించవచ్చు కానీ ఆరు బంతుల్లో ఆరు సిక్సులంటే నమ్మశక్యం కాని విషయం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందులోనూ ఆ వీడియో అసంపూర్ణంగా ఉండటం గమనార్హం. ఇక భారత అభిమానులైతే.. ‘నెట్స్ లో రోజుకు 150 సిక్సర్లు కొడతా..” అన్న పాక్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అసిఫ్ అలీని చర్చకు తీసుకొస్తున్నారు. ఏదేమైనా.. బాబర్ ఆజామ్ ప్రాక్టీస్ మ్యాచులో 6 సిక్సర్ల రికార్డు నెలకొల్పడానే చెప్పాలి. ఈ 6 సిక్సర్లపై.. మీ అభిప్రాయమేంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Babar Azam hits a total of NINE SIXES in Peshawar Zalmi training session. New role for him in the team it seems! 🔥 #HBLPSL8
Watch more of these big sixes from Babar here 👇https://t.co/7PPaaRUUmK pic.twitter.com/NXADD2ZKPj
— Farid Khan (@_FaridKhan) February 13, 2023
Waise nets pe Asif ali 150 chhake maar leta hey . pic.twitter.com/pW2UOkAR9k
— Shaira Noorani (@NooraniShaira) February 13, 2023