పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ మంచి ఫామ్‌లో కొనసాగుతూ అద్బుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ కాలం క్రికెటర్లలో టాలెంటెడ్ క్రికెటర్లలో బాబర్ ఒకడు. అతన్ని పాకిస్థాన్ విరాట్ కోహ్లీ ఇని కూడా పిలుస్తారు. ఇంతవరకు ఓకే. కానీ.. పాక్ మాజీ క్రికెటర్ బాబర్ అజమ్‌ను ఇద్దరు లెజెండరీ క్రికెటర్లతో పోల్చి సోషల్ మీడియాలో విమర్శలకు గురిఅవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ బాబర్ అజమ్‌ను ఏకంగా ప్రపంచ క్రికెట్‌లో ఒక లెజెండ్స్‌గా కీర్తించబడే డాన్ బ్రాడ్‌మెన్, బ్రియన్ లారాతో పోల్చాడు. బాబర్ ప్రస్తుతం కాలంలో.. ఒక బ్రాడ్‌మెన్, లారా లాంటి వాడంటూ పేర్కొన్నాడు.
దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వాళ్ల గొప్ప క్రికెటర్లు అని.. బాబర్ కూడా మంచి టాలెంటెడ్ ప్లేయర్ అని అంతమాత్రం దానికే వాళ్ల పోల్చడం కొంచెం అతి అవుతుందని అభిప్రాయపడుతున్నారు. యువ క్రికెటర్లను దిగ్గజ ఆటగాళ్లతో పోల్చడం వారికి ప్రోత్సాహం ఇచ్చినా.. అతి పోలిక దిగ్గజాలను అవమానించేలా ఉంటుందని మండిపడుతున్నారు. బ్రాడ్‌మెన్, లారా లాంటి దిగ్గజాలతో పోల్చే స్థాయి బాబర్‌కు ఇంకా రాలేదని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పాక్ కెప్టెన్ బాబర్ అజమ్‌కు ఘోర అవమానం! వేలంలో అమ్ముడుపోని స్టార్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.