పాకిస్థాన్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ బాబర్ అజమ్ హనీట్రాప్‌లో చిక్కుకున్నాడు. తన తోటి క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్టింగ్ చేసిన వీడియోలు బయటికొచ్చాయి. ఆ అమ్మాయితో నగ్నంగా వీడియోల్స్లో మాట్లాడినట్లు కొన్ని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాబర్ అజమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. ‘తనతో ఇలాగే సెక్స్టింగ్(సెక్స్ చాట్) చేస్తే.. నీ బాయ్ ఫ్రెండ్ పాకిస్థాన్ టీమ్‌లో కొనసాగుతాడు’ అంటూ బాబర్ ఆ అమ్మాయితో అన్నట్లు వీడియోల్లో ఉంది. బాబర్‌కు సంబంధించిన కొన్ని వాయిస్ మేసేజ్‌లు సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
గతంలో హమీజా ముఖ్తర్ అనే యువతిని సైతం బాబర్ అజమ్ వేధించాడని, బెదిరించాడని, బ్లాక్మెయిల్ చేశాడనే ఆరోపణలను ఉన్నాయి. బాబర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా దగ్గరయ్యాడని.. తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించాడని సదరు యువతి హమీజా ఆరోపణలు కూడా చేసింది. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ ఇప్పుడు బాబర్‌పై సెక్స్టింగ్ ఆరోపణలు రావడం వాటికి సంబంధించిన వీడియోలు, వాయిస్ మేసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం సంచలనంగా మారింగి. ఆటగాడిగా ప్రపంచ మేటి క్రికెటర్‌గా ఉన్న బాబర్.. కెప్టెన్‌గా మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే ఆలోచన పాక్ క్రికెట్ బోర్డు ఉంది. ఇప్పుడు ఈ హనీట్రాప్ బయటపడటంతో బాబర్‌పై చర్చలు తీసుకునే అవకాశం ఉంది.
అయితే బాబర్ అజమ్ హనీట్రాప్ విషయంతో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఉన్న బాబర్ అజమ్ కాదని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొంటున్నారు. అలాగే మరికొంతమంది అది బాబర్ అజమ్ అయినా.. అది అతని వ్యక్తిగత జీవితం అయి.. అందులోకి మనం తొంగిచూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ట్విట్టర్లో ‘స్టేస్ట్రాంగ్బాబర్’, ‘ఐయామ్విత్స్కిప్పర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌లు సైతం ట్రెండ్ అవుతున్నాయి. కాగా.. చాలా మంది నెటిజన్లు మాత్రం బాబర్ అజమ్ ఇలా దిగజారుతాడని అనుకోలేదని.. తొటి క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్టింగ్ చేయడం సిగ్గుచేటని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Karachi Lobby is behind this #BabarAzam pic.twitter.com/m3dlWgUpZW
— Jasim Hussain (@jasimhussainn) January 15, 2023
Babar Azam sexting with gf of another Pakistan cricketer and promising her that her bf won’t be out of team if she keeps sexting with him is just 👎🏿
I hope allah is watching all this .
— Dr Nimo Yadav (@niiravmodi) January 15, 2023