ఆసియా కప్ 2022లో భాగంగా ఆదివారం పాక్ తో ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో పాక్ ని ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ పరాజయం అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మ్యాచ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
బాబర్ ఆజామ్.. ప్రస్తుతం ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడు. ఇక ఇతడి బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాబర్ వన్డేల్లో నెం.1 బ్యాట్స్ మన్ గా కొనసాగుతున్నాడు. ఇక టీ20ల్లో సైతం ఇతడు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ఇండియాపై ఓటమి తర్వతా బాబర్ ఈ విధంగా స్పందించాడు.” మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ బ్యాటింగ్ లో వైఫల్యమే మా ఓటమిని శాసించింది. ఇక మేం భారత్ కు విసిరిన లక్ష్యం వారికి ఏ మాత్రం సరిపోలేదని వెల్లడించాడు. ఇంకొన్ని పరుగులు చేయాల్సిందని” తన మనసులో మాట బయట పెట్టాడు.
మరిన్ని వివరాల గురించి మాట్లాడుతూ..” మేం ఈ మ్యాచ్ లో ఇంకో 10 లేదా 15 పరుగులు చేయల్సిందని, మా బౌలర్లు తమ కృషితో మ్యాచ్ ను విజయం దిశగా తీసుకెళ్లారు. కానీ కీలక సమయంలో భారత బ్యాటర్ హార్దిక్ పాండ్య విజృంభించడంతో మా ఓటమి ఖాయం అయ్యింది. ఇండియాను ఒత్తిడిలోకి నెట్టాలి అనేదే మా ప్రధాన ఉద్దేశం.
దానికి తగ్గట్టుగానే మేం మా ప్రణాళిక ప్రకారం నవాజ్ కు లాస్ట్ వరకు బౌలింగ్ ఇవ్వలేదు. ఇక యువ ఆటగాడు నసీమ్ షా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అతడు భారత్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శించడం చాలా గొప్ప విషయం” అని షా పై ప్రశంసలు కురిపించాడు. మరి పాక్ కెప్టెన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.