పాక్ క్రికెటర్ బాబర్ అజమ్ ఊహించని పనిచేశాడు. దీంతో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అనగానే ఆటగాళ్లు ఆడతారు, ఆ తర్వాత వెళ్లిపోతారు. కొన్నిసార్లు మ్యాచ్ గెలిచిన విషయాన్ని గ్రౌండ్ లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదీ కాదంటే ఫ్యాన్స్ అందరినీ పలకరించి వెళ్లిపోతారు. అయితే పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ చేసిన పని మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్ ప్రీమియర్ లీగ్ లోని ఓ మ్యాచ్ సందర్భంగా జరిగింది మాత్రం నెటిజన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. ఇంతకీ బాబర్ అజమ్ ఏం చేశాడు?
ఇక విషయానికొస్తే.. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాటింగ్ లో పలు రికార్డులు నెలకొల్పిన ఈ ఆటగాడు.. రీసెంట్ గా హనీట్రాప్ వివాదంలోనూ చిక్కుకున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ లో పెషావర్ జాల్మీ జట్టుకు కెప్టెన్సీ చేస్తున్నాడు. తాజాగా కరాచీ వేదికగా జరిగిన ఈ మ్యాచులో అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేసి 68 పరుగులతో ఆకట్టుకున్నాడు. కరాచీ జట్టు పోరాడినప్పటికీ.. పెషావర్ జట్టు విజేతగా నిలిచింది. 2 పరుగుల తేడాతో గెలిచింది.
అయితే డగౌట్ లో, బౌండరీ దగ్గర చాలామంది వాటర్ బాటిల్స్ తాగిపడేశారు. మ్యాచ్ తర్వాత కరాచీ కింగ్స్, పెషావర్ ఆటగాళ్లు.. ఆయా బాటిల్స్ అన్నింటికీ కూడా డస్ట్ బిన్ లో వేస్తూ, గ్రౌండ్ క్లీనింగ్ కు తమ వంతు సాయం చేశారు. ఈ వీడియోను పీఎస్ఎల్ మీమ్స్ ఆఫీషియల్ అనే ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ఇక బాబర్ అజమ్ ఊహించని విధంగా ఈ పనిచేసేసరికి ఫ్యాన్స్ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. మరి బాబర్, గ్రౌండ్ లో బాటిల్స్ ఎత్తి, క్లీనింగ్ కు హెల్ప్ చేయడంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో చెప్పండి.
Babar azam king 👑 was helping to clean the ground. Aik he dil hai kitni bar jeeto ge 🥺❤️ #BabarAzam𓃵 #PSL8 #PSL2023 #PeshawarZalmi pic.twitter.com/f0NjAb7ufr
— PSL Memes Official (@PSL_memess) February 15, 2023