పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రస్తుతం ఉన్న టాప్ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్న బాబర్.. టెస్టుల్లో మూడో స్థానంలో, టీ20ల్లో నాలుగో స్థానంలో, అలాగే వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నాడు. అలాగే పాకిస్థాన్ జట్టులో కూడా మూడు ఫార్మాట్లలో తిరుగులేని కెప్టెన్‌గా ఏలుతున్నాడు. కానీ.. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్ వైట్ వాష్‌కు గురవ్వడంతో.. కెప్టెన్ బాబర్ అజమ్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అది కూడా పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో మరే కెప్టెన్‌కు లేని చెత్త రికార్డును బాబర్ తన పేరిట లిఖించుకున్నాడు. బ్యాటర్‌గా రాణిస్తున్న బాబర్ అజమ్.. టెస్టుల్లో మాత్రం టీమ్‌ను సరిగ్గా నడపలేకపోతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్‌కు వచ్చిన ఇంగ్లండ్.. మూడు టెస్టుల సిరీస్‌లో పాక్‌ను వైట్‌వాష్ చేసింది. రావాల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో 74 రన్స్ తేడాతో, అలాగే ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో, ఇక కరాచీలో జరిగిన చివరిదైన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో స్టోక్స్ సేన మూడు టెస్టుల్లో ఘన విజయం సాధించింది. రావాల్పిండి ఫ్లాట్ పిచ్‌పై కూడా రిస్క్ తీసుకుని మరీ గెలిచింది ఇంగ్లండ్. అయితే.. ఇంగ్లండ్ కంటే ముందు పాకిస్థాన్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్ ఆడింది. ఆ మూడు టెస్టుల్లో తొలి రెండు టెస్టులను డ్రా చేసుకున్న పాకిస్థాన్ మూడో టెస్టులో మాత్రం ఓడింది.
మూడు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-0తో కైవసం చేసుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో గెలిచింది. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు, ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల ఓటమితో.. పాకిస్థాన్ వరుసగా నాలుగు టెస్టుల్లో ఓటమి చవిచూసింది. ఈ నాలుగు ఓటములు బాబార్ అజమ్ కెప్టెన్సీలోనే వచ్చాయి. అలాగే ఒకే క్యాలెండర్ ఇయర్లో వరుసగా నాలుగు టెస్టులు ఓడిన పాకిస్థాన్ తొలి కెప్టెన్‌గా బాబర్ అజమ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గతంలో ఏ పాకిస్థాన్ కెప్టెన్ కూడా ఇలాంటి చెత్త రికార్డు కలిగి లేడు. అయితే 2003లో ఇంజుమామ్ ఉల్ హక్ కెప్టెన్సీలో పాక్ వరుసగా మూడు టెస్టులు ఓడింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో పాకిస్థాన్‌ను బాగానే నడిపిస్తున్న బాబర్ అజమ్.. టెస్టుల్లోకి వచ్చేసరికి తడబడుతున్నాడు. మరి బాబర్ అజమ్ మూటగట్టుకున్న చెత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Babar Azam’s Test captaincy is to be questioned 🤯#CricketTwitter #engvspak pic.twitter.com/TKuBEPpTRI
— Sportskeeda (@Sportskeeda) December 20, 2022