భారత్‌తో అహ్మాదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్లబ్యాడ్జీలు ధరించి ఆడుతున్నారు. తొలి రోజు మామూలుగానే ఆడిన వాళ్లు రెండో రోజు అవి ధరించేందుకు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా.. అద్భుతంగా ఆడుతోంది. 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా.. లంచ్ సమయం వరకు కూడా మరో వికెట్ కోల్పోలేదు. 129 ఓవర్లు ముగిసిన తర్వాత.. అవే 4 వికెట్ట నష్టానికి 376 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 160 మార్క్ దాటేసి.. డబుట్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. అతనితో పాటు యువ క్రికెటర్ కామెరున్ గ్రీన్ సెంచరీతో సత్తా చాటాడు. వీరిద్దరి మధ్య 200 పైచిలుకు పరుగుల భాగస్వామ్య నమోదైంది. తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు చివరి టెస్టులో మాత్రమే సెంచరీలు నమోదు అయ్యాయి.
ఇలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ.. టీమిండియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియాను భారత్ బౌలర్లు నియంత్రించలేకపోతున్నారు. అయితే.. 378 పరుగుల వద్ద అశ్విన్ భారత్‌కు బ్రేక్‌త్రూ అందించాడు. 114 పరుగులు చేసి గ్రీన్ అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే అలెక్స్ కారీని అశ్విన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే.. రెండో రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతికి నల్లబ్యాడ్జీలు ధరించి బ్యాటింగ్‌కు దిగుతున్నారు. ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తల్లి శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూయగా.. ఆమె మృతికి సంతాపంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్లబ్యాడ్జీలు ధరించి మైదానంలోకి దిగుతున్నారు. తన కెప్టెన్‌కు ఈ విషాద సమయంలో అండగా ఉన్నామని తెలిపేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.
తల్లి అనారోగ్యంతో చావుబతుకుల మధ్య పోరాడుతున్న సమయంలో ఆమెతో ఉండేందుకు మూడో, నాలుగు టెస్టులకు కమ్మిన్స్ దూరమైన విషయం తెలిసిందే. తల్లి చివరి క్షణాల్లో దాదాపు 20 రోజులు ఆస్పత్రిలో కమ్మిన్స్ పక్కనే ఉన్నాడు. ఆట కంటే కూడా తల్లికి కమ్మిన్స్ ఇచ్చిన ప్రాముఖ్యతను క్రికెట్ అభిమానులు సైతం మొచ్చుకున్నారు. కానీ.. చివరికి ఆ తల్లి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాదం నుంచి కమ్మిన్స్ వీలైనంత త్వరగా బయటపడాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. మరి ఆస్ట్రేలియా ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Our deepest condolences to Pat Cummins and his family after the passing of his mother Maria. pic.twitter.com/rmlL9xSDvf
— ICC (@ICC) March 10, 2023
Mother of Pat Cummins passed away.
Australian players will be wearing black armbands to mark the respect.
— Johns. (@CricCrazyJohns) March 10, 2023