సాధారణంగా సెలబ్రిటీలకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. వారికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అందరు ఆసక్తిగా ఉంటారు. వాళ్లకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చిన తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనుబరుస్తుంటారు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మాక్స్ వేల్ కు భారతీయ అమ్మాయి వినీ రామన్ తో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఈ జంట తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ లో షేర్ చేశారు. అయితే తాజాగా పెళ్లి దుస్తుల్లో ఉన్న వారిద్దరి ఫోటో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి ముందే భారతీయ యువతి వినీ రామన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఈ కొత్త జంటకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఇక పెళ్లి చేసుకున్న మాక్స్ వెల్ కు ఆర్సీబీతోపాటు అభిమానులు స్టార్ ప్లేయర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్స్ వెల్ మొదటి రెండు మ్యాచ్ లకు దూరం ఉన్నాడు.తదుపరి మ్యాచ్ లకు మాక్స్ వెల్ రాకతో బలంగా ఉన్న రాయల్ చాలెంజర్స్ మరింత బలంగా మారనుంది. ఈ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ తన మొదటి మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించినప్పటికి పరాజయం పాలయ్యింది. తదుపరి మ్యాచ్ లో మాక్స్ వెల్ రాకతో జట్టు పటిష్టంగా మారి విజయాలు తమ ఖాతాలో వేసుకోనుందని విశ్లేషకుల అభిప్రాయం. అయితే తాజాగా వారిద్దరికి సంబంధించిన పెళ్లి ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ పిక్స్ పై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.