క్రికెట్ మైదానంలో తమ ఆటతీరుతు కోట్ల మంది అభిమాం సంపాదించే స్టార్ ఆటగాళ్లు నిజ జీవితంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేసర్ సీన్ అబాట్.. తన ప్రియురాలు అయిన బ్రియర్ నీల్‌ను వివాహం చేసుకున్నాడు. తన పెళ్లి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ రోజు తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అంటూ స్పష్టం చేశాడు. అయితే ఈ జంటకు ఇప్పటికే ఓ పాప ఉంది.. తమ ముద్దుల పాప సాక్షిగా తమ వివాహం జరుపుకున్నారు.
జీవితంలో పెళ్లి అనేది ఓ మధురమైన ఘట్టం. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ వివాహ వేడుక జీవితంలో గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బౌటర్ సీన్ అబాట్ తన ప్రియురాలు బ్రియర్ నీల్ ని బుధవారం వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం అత్యంత సన్నిహితుల మద్య జరిగింది. ఈ సందర్భంగా ‘నిన్ను ప్రేమించి పెళ్లాడుతున్నాను.. నా లైఫ్ లో నువే బెస్ట్ ఫ్రెండ్, ఈ వివాహం నా స్నేహితులు, బంధువుల మద్య జరుపుకోవడం నాకు గొప్ప అనుభూతినిస్తుంది’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
అబాట్ కెరీర్ విషయానికి వస్తే.. 2014 పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తర్వాత తనదైన ఆట తీరుతో అందరి హృదయాలు గెల్చుకున్నాడు. అయితే మధ్యలో ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన సీన్ అబాట్ మళ్లీ 2019లో రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్-2022 సీజన్లో సీన్ అబాట్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Sean Abbott (@seanabbott77) June 30, 2022