ఆస్ట్రేలియాను జింబాబ్వే బౌలర్లు వణికించారు. హేమాహేమీ బ్యాటర్లు ఉన్న ఆసీస్‌ను కేవలం 141 పరుగులకే ఆలౌట్ చేసి జింబాబ్వే సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అందరి దృష్టి ఆసియా కప్‌పై ఉండగా.. మరోవైపు ఆస్ట్రేలియా-జింబాబ్వే మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. శనివారం ప్రారంభమైన మూడో వన్డేలో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ రెండో బంతికి ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్(5)ను నగరవ అవుట్ చేయడంతో ఆసీస్ పతనం మొదలైంది. ఇక్కడి నుంచి ప్రతి పది పరుగులకు ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోతూ వచ్చింది. ఒక ఎండ్ డేవిడ్ వార్నర్ 96 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో 94 పరుగులు చేసి ఒంటరి పోరాట చేశాడు.
కానీ.. మిగతా బ్యాటర్లు మాత్రం జింబాబ్వే బౌలర్ ర్యాన్ బర్ల్ బౌలింగ్ ఆడేందుకు వణికిపోయారు. స్టీవ్ స్మిత్(1), ఆలెక్స్ క్యారీ(4), స్టోయినీస్(3), గ్రీన్(3), మ్యాక్స్‌వెల్(19), అష్టన్ అగర్(0), స్టార్క్(2), ఆడమ్ జంపా(1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివరికి హెజల్‌వుడ్(0 నాటౌట్) ఒక్కడే మిగిలాడు. జింబాబ్వే బౌలర్లలో నగరవ, న్యౌచి చెరో వికెట్ తీసుకున్నారు. బ్రాడ్ ఎవాన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే హీరో ర్యాన్ బర్ల్ 5 వికెట్ల హల్‌తో రెచ్చిపోయాడు. ఇటివల టీమిండియాతో మూడు వన్డేలు ఆడిన జింబాబ్వే ఎలాంటి సంచలనాలు నమోదు చేయలేకపోయింది.
ఆస్ట్రేలియా అనే సరికీ వారిలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చినట్లు ఉంది. గతంలో 2007లో టీ20 వరల్డ్ కప్‌లోనూ జింబాబ్వే ఆస్ట్రేలియాను 138 పరుగులకే కట్టడి చేసి ఆ మ్యాచ్‌లో గెలుపొందింది. ఇప్పుడు ఈ వన్డేలో కూడా గెలిచేలా కనిపిస్తుంది. ఆస్ట్రేలియాను 141కే ఆలౌట్ చేసిన జింబాబ్వే 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 38 పరుగులు చేసింది. కాగా.. ఆస్ట్రేలియాకు జింబాబ్వే ఉంటే ఇంకా భయం పోలేదా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కొన్ని ఒక దశాబ్దం పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియాకు పసికూనగా పేరున్న జింబాబ్వే అపుడప్పుడూ షాక్ ఇస్తుంది. మరి ఈ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకోని కోహ్లీ.. అయినా ఇది వరల్డ్ రికార్డ్ ఇన్నింగ్స్!
Aus all out for 141 against Zim in 3rd ODI.
Warner was the highest scorer with 94 while Zimbabwe’s Ryan Burl picked 5 wickets.#PAKvHK #AUSvZIM pic.twitter.com/ybAu7kVjnq— Muhammad Faizan // HASAN ALI STAN (@KhanFaizan645) September 3, 2022
వీడియో: అసలు బెండపూడి పాఠశాలలో ఏం జరుగుతోంది?