ఆసియాకప్ లో టీమిండియాకు తొలి ఓటమి. అది కూడా పాకిస్థాన్ చేతిలో.. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో మన జట్టు కొన్ని తప్పిదాలు చేయడంతో ఓడిపోవడమే కాకుండా ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఓవైపు బాధపడుతున్న ఫ్యాన్స్.. మరోవైపు రోహిత్ సేన.. ఫైనల్లో అడుగుపెడుతుందా లేదా ప్రిడిక్షన్స్ చేస్తున్నారు. అలా జరిగితేనే మనం టైటిల్ పోరులో ఉంటామని కూడా మాట్లాడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఆసియాకప్ టోర్నీకి దుబాయి ఆతిథ్యమిచ్చింది. లీగ్ దశలో పాకిస్థాన్, హాంకాంగ్ జట్లపై గెలిచిన భారత జట్టు.. సూపర్ 4కి అర్హత సాధించింది. ఇందులో పాక్ జట్టు మళ్లీ ఎదురైంది. ఆదివారం మ్యాచ్ కూడా జరిగింది. కాకపోతే ఈసారి కూడా మన జట్టు గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ రోహిత్ సేన.. చిన్న చిన్న తప్పిదాలు చేయడంతో.. గెలవాల్సిన మ్యాచ్ కాస్త ఓడిపోయాం. దీంతో ఫైనల్ అవకాశాలని క్లిష్టతరం చేసుకున్నాం.
ఇకపోతే భారత్ ఫైనల్లో అడుగుపెట్టాలంటే ఆ విషయం పక్కా జరగాలి. అది ఏంటంటే.. సూపర్ 4లో నాలుగు జట్లు.. ఒక్కో జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. టాప్ 2 టీమ్స్.. ఫైనల్లో అడుగుపెడతాయి. ఇక్కడ వరకు అంతా బానే ఉంది. ఇక పాక్ జట్టుతో మ్యాచ్ ఓడిపోయేసరికి.. భారత్ రన్ రేట్ మైనస్ లోకి వెళ్లింది. దీంతో భారత్.. మిగతా రెండు మ్యాచులు(అఫ్ఘన్, శ్రీలంకతో) గెలిచితీరాలి. పాక్ శ్రీలంకని ఓడిస్తే.. లంక జట్టు ఇంటికెళుతుంది. అది శ్రీలంక గెలిస్తే.. నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. కాబట్టి మనం రెండు మ్యాచులు భారీ తేడాతో గెలవాలి. దీన్నిబట్టి ఆసియాకప్ లో ఏం జరుగుతుందో చూడాలి. భారత్ ఫైనల్ కి వెళ్తుందా మరి.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: టీమిండియాకు ఎదురుదెబ్బ! కోహ్లీ చెలరేగినా పాక్ చేతిలో ఓటమి