ఆసియా కప్ 2022లో నేడు(మంగళవారం సెప్టెంబర్ 6) శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత్‌కు షాకిచ్చాడు. ఆసియా కప్‌ను టీమిండియా కాకుండా మరో జట్టు గెలుస్తుందంటూ అభిప్రాయపడ్డాడు. గ్రూప్ స్టేజ్‌లో పాక్, హాంకాంగ్‌పై వరుస విజయాలు సాధించి సూపర్ ఫోర్‌కు చేరిన భారత్‌కు పాక్ షాకిచ్చింది. సూపర్ ఫోర్ తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాక్‌పై ఓడి ఫైనల్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. నేడు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి వచ్చింది.
టీమిండియా ఫైనల్ చేరాలంటే శ్రీలంక, అఫ్ఘనిస్థాన్‌పై కచ్చితంగా మంచి రన్‌రేట్‌తో గెలవాలి. శ్రీలంకతో మ్యాచ్ ఓడితే.. ఆసియా కప్‌ను మర్చిపోవాల్సిందే అంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు. శ్రీలంకపై భారత్ ఓడితే.. పాకిస్థాన్ ఆసియా కప్‌ను ఎగరేసుకుపోతుందని జోస్యం చెప్పాడు. కాగా.. శ్రీలంకతో టీమిండియా మ్యాచ్ ఓడి.. అఫ్ఘనిస్థాన్‌పై భారీ తేడాతో గెలిస్తే.. అప్పడు పాకిస్థాన్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడాలి. ఇలా చాలా సమీకరణాల మధ్య భారత్ ఫైనల్ చేరుతుంది. అలా కాకుండా శ్రీలంక, అఫ్ఘనిస్థాన్‌ను భారీ తేడాతో ఓడిస్తే.. ఫైనల్ చేరే అవకాశం ఖాయం. కానీ.. శ్రీలంక, అఫ్ఘనిస్థాన్‌ను అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.
శ్రీలంకకు ఆసియా కప్‌లో మంచి రికార్డు ఉంది. భారత్-శ్రీలంక ముఖాముఖి పోరులో 10, 10 విజయాలతో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంక టీమ్ కొంత వీక్‌గా ఉన్నా.. అఫ్ఘనిస్థాన్‌పై సూపర్ ఫోర్‌లో అద్భుతంగా ఆడారు. కాగా ఇప్పటి వరకు 14 సార్లు ఆసియా కప్ నిర్వహించగా.. టీమిండియా అత్యధిక సార్లు విజేతగా నిలిచింది. మొత్తం 7 సార్లు టీమిండియా ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది. భారత్ తర్వాత శ్రీలంక అత్యధికంగా 5 సార్లు కప్ కొట్టింది. మరి శ్రీలంక-భారత్ మ్యాచ్‌పై, పాకిస్థాన్ ఆసియా కప్ గెలుస్తుందని సెహ్వాగ్ పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: టీ20ల్లో టాప్ 5 క్రికెటర్లను ప్రకటించిన పాంటింగ్! భారత్ నుంచి ఇద్దరు..
Virender Sehwag has made a startling prediction regarding the ongoing Asia Cup 2022 winner. Read here👇#VirenderSehwag #india #indiancricketteam #AsiaCup2022 #AisaCup #SriLanka #Pakistan #indvspak #IndiaVsPakistan #sports #crickethttps://t.co/tzrByjvhom
— CricketCountry (@cricket_country) September 6, 2022