ఎనిమిదో సారి ఆసియా కప్ విజేతగా నిలవడంలో టీమిండియా విఫలం అయింది. టోర్నీ ప్రారంభానికి ముందు హాట్‌ఫేవరేట్‌గా టీమిండియా ఆసియా కప్ బరిలోకి దిగింది. అంచనాలకు తగ్గట్లే.. గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్, హాంకాంగ్‌ను ఓడించి.. సూపర్ ఫోర్‌కు చేరింది. కానీ ఇక్కడి నుంచి టీమిండియా చతికిల పడింది. సూపర్ ఫోర్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడి దారుణ విమర్శలు మూటగట్టుకుంది. ఆ తర్వాత కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అండర్‌డాగ్స్ శ్రీలంక చేతిలోనూ ఘోర ఓటమితో ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే వేరే టీమ్స్ గెలుపోటములపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో టీమిండియాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మిడిల్డార్ ప్లేయర్లు పంత్, హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలం అయ్యారు. ఇక బౌలింగ్ విభాగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.
ఆసియా కప్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయలేదు. హాంకాంగ్ లాంటి జట్టు మనపై 152 పరుగులు చేసి కేవలం 5 వికెట్లు మాత్రమే ఇచ్చింది. 21 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన అఫ్ఘనిస్థాన్ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. ఇలా ఆసియా కప్ 2022లో టీమిండియా బౌలింగ్ విభాగం దారుణంగా విఫలం అయింది. టీ20 వరల్డ్ కప్ ప్రణాళికలను చెప్పి జట్టులో అనవసరంగా మార్పులు చేస్తూ.. టీమ్ మేనేజ్‌మెంట్, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఓటములకు కారణం అవుతున్నారని క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పించారు. చివరి మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించినా.. ఆ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేయడంతో ఫ్యాన్స్ కొంత శాంతించారు.
ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీని ఇంటర్వ్యూ చేస్తూ.. ఆసియా కప్‌లో టీమిండియా వైఫల్యంపై స్పందించాడు. టాస్ కారణంగా ఆసియా కప్‌లో విఫలం అయినట్లు చెప్పాడు. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో టాస్ మరీ ఇంత కీలకం కావద్దని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. రోహిత్ చెప్పినట్లు యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో టాస్ కీలక పాత్ర పోషిస్తోంది. సూపర్ ఫోర్‌లో టీమిండియా మూడు మ్యాచ్‌ల్లోనూ టాస్ ఓడింది. పాకిస్థాన్, శ్రీలంక మనపై టాస్ గెలిచి సద్వినియోగం చేసుకున్నాయి. చివరి మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్ టాస్ గెలిచినా.. కోహ్లీ, భువనేశ్వర్ కుమార్ చెలరేగడంతో అఫ్ఘనిస్థాన్ ఓడిపోయింది.
అంతకంటే ముందు రోజే పాకిస్థాన్‌తో థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఓడి.. వెంటనే మరుసటి రోజు మ్యాచ్ కావడంతో ఆఫ్ఘాన్ ఆటగాళ్లు సైతం అంత యాక్టీవ్‌గా కనిపించలేదు. సులవైన క్యాచ్‌లు వదిలేస్తూ.. కొంత నిరాశలో కనిపించారు. గెలిచినా, ఓడినా పెద్దగా పోయేది ఏమిలేని మ్యాచ్ కావడంతో టీమిండియా ఆటగాళ్లు సైతం చాలా ఫ్రీగా ఆడారు. అయినా.. ఆసియా కప్‌లో టాస్ గెలిచిన టీమ్ కళ్లు ముసుకుని ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. పైగా డ్యూ కూడా వస్తుండంతో బౌలింగ్ చేయడం ఇబ్బందిగా మారుతోంది. ఆదివారం పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరిగే ఫైనల్‌లో కూడా టాస్ కీలకం కానుంది. టాస్ ఎవరు గెలిస్తే.. ఆసియా కప్ వాళ్లదే అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఈ ఒక్కటి సరిగ్గా జరిగి ఉంటే టీమిండియా ఆసియా కప్ ఫైనల్ ఆడేది!
What happens when @ImRo45 interviews @imVkohli ☺️ 👏
Laughs, mutual admiration & a lot of respect 😎- by @ameyatilak
Full interview 📽️https://t.co/8bVUaa0pUw #TeamIndia | #AsiaCup2022 | #INDvAFG pic.twitter.com/GkdPr9crLh
— BCCI (@BCCI) September 9, 2022