ఆసియా కప్‌లో మరోసారి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు రూట్ క్లియర్ అయింది. శుక్రవారం హాంకాంగ్‌ను పాకిస్థాన్ చిత్తుచిత్తుగా ఓడించి సూపర్ ఫోర్‌కు అర్హత సాధించింది. దీంతో సూపర్ ఫోర్‌లో టీమిండియాతో ఆదివారం పాక్ తలపడనుంది. గ్రూప్ ఏలో టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్ సూపర్ ఫోర్‌కు చేరేందుకు హాంకాంగ్‌తో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హాంకాంగ్‌ను చావుదెబ్బకొట్టింది. హాంకాంగ్‌ను 38 పరుగులకే కుప్పకూల్చి ఏకంగా 155 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి.. సూపర్ ఫోర్‌లోకి అడుగుపెట్టింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఆరంభంలోనే కెప్టెన్ బాబర్ అజమ్(9) వికెట్‌ను కోల్పోయింది. దీంతో మరో ఓపెనర్ రిజ్వాన్, వన్‌డౌన్‌లో వచ్చిన ఫకర్ జమాన్ స్లోగా ఆడారు. నిజానికి హాంకాంగ్ బౌలర్లు వారికి షాట్లు ఆడే అవకాశమే ఇవ్వలేదు. భారత్‌పై చేసినట్లే 15వ ఓవర్ వరకు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. రిజ్వాన్, జమాన్ సింగిల్స్, టూస్.. అడపాదడపా బౌండరీలను స్కోర్ బోర్డును నడిపించారు. 13వ ఓవర్ నుంచి ఇద్దరూ వేగంగా ఆడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. మరింత వేగంగా డే క్రమంలో 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేసిన ఫకర్ జమాన్ ఎహెసాన్ ఖాన్ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి అజీజ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక క్రీజ్‌లోకి వచ్చిన ఖుష్‌దిల్ షా వీరవిహారం చేశాడు. 15 బంతుల్లోనే 5 సిక్సులతో 35 పరుగులు బాది 160 పోతుందనుకున్న పాక్ స్కోర్‌ను 193 పరుగులకు చేర్చాడు.
ముఖ్యంగా అజీజ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. తొలి రెండు బంతులను అద్భుతంగా డాట్స్ బాల్స్‌గా వేసిన అజీజ్.. మూడో బంతికి సిక్స్ ఇచ్చి ఒత్తిడికి గురయ్యాడు. తర్వాత భారీ వైడ్ వేయడంతో అది కాస్తా బౌండరీకి వెళ్లింది. దీంతో అదనంగా పాక్‌కు ఐదు పరుగులు వచ్చాయి. తర్వాతి మూడు బంతులను ఖుష్‌దిల్ షా భారీ సిక్సులుగా మలిచాడు. దీంతో చివరి ఒక్క ఓవర్‌లోనే పాక్‌కు ఏకంగా 29 పరుగులు వచ్చాయి. దీంతో 20 ఓవర్లు పూర్తి అయ్యే సరికి పాక్ 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ 57 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 78 పరుగులు, ఖుష్‌దిల్ షా 15 బంతుల్లో 5 సిక్సులతో 35 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు. కాగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హాంకాంగ్ చివరి ఐదు ఓవర్లలో తీవ్ర ఒత్తిడికి గురైంది. సూర్యకుమార్ యాదవ్ కూడా చివరి ఓవర్‌లో నాలుగు సిక్సులు బాదిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఖుష్‌దిల్ షా కూడా నాలుగు సిక్సులు బాదడం విశేషం.
193 పరుగుల భారీ లక్ష్యఛేదనుకు దిగిన హాంకాంగ్ మ్యాచ్ గెలవకున్నా.. టీమిండియాపై ఆడినట్లు కనీసం పోరాటం చేస్తుందని అంతా భావించారు. కానీ.. హాంకాంగ్ బ్యాటర్లు పాక్ బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ నిజాఖత్ ఖాన్ (2), ముర్తాజా (2), బాబర్ హయత్ (0), కించిత్ షా (6), ఐజాజ్ ఖాన్ (1), స్కాట్ (4), జీషన్ అలీ (3), హరూన్ అర్షద్ (3), అయుష్ శుక్లా (1), మహమ్మద్ గజన్ ఫర్ (0), ఎసాన్ ఖాన్ (1నాటౌట్) సింగిల్ డిజిట్‌కే అవుట్ అయ్యారు. ఒక్కరు కూడా 10 పరుగులకు మించి స్కోరు చేయలేదు. దీంతో 38పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో నషీమ్ షా 2, దహానీ 1, షాదాబ్ ఖాన్ 4, నవాజ్ 3 వికెట్లు తీసి హాంకాంగ్ ఇన్నింగ్స్‌ను అతలాకుతలం చేశారు. మరి ఈ మ్యాచ్‌లో హాంకాంగ్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకోని కోహ్లీ.. అయినా ఇది వరల్డ్ రికార్డ్ ఇన్నింగ్స్!
29 Runs in Last Over !! ❤️⚡
Khushdil Shah You Beauty 😍❤️🔥 pic.twitter.com/1UTQ8pOHIn
— 𝐂𝐫𝐢𝐜 𝐕𝐢𝐛𝐞𝐬𝐬 🇵🇰✨ (@Cric_vibes) September 2, 2022
This is what Khushdil Shah is renowned for 🫶#PAKvHK #AsiaCup2022 pic.twitter.com/fOdl99KzDd
— Cricket Pakistan (@cricketpakcompk) September 2, 2022
If suriya kumar can hit 4 sixes on 4 balls
Then pakistan also have kushdil shah who can hit 4 sixes on 4 balls pic.twitter.com/RVKKyyjoIf— Ammad (@Ammaadd61) September 2, 2022
4 Balls 4 Sixes by Khushdil Shah ❤😍#PAKvsHKG pic.twitter.com/Kxqfa1OGuB
— Jahanzaib Ansari (@ZebiAnsari06) September 2, 2022