చరిత్రలో తొలిసారి పాకిస్థాన్ గెలవాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆసియా కప్ 2022లో నేడు(శుక్రవారం) హాంకాంగ్‌పై పాక్ గెలవాలని ప్రార్ధిస్తున్నారు. అదేంటి చిరకాల ప్రత్యర్థి పాక్ గెలవాలని ఇండియన్స్ ఎందుకు కోరుకుంటారు? పిచ్చి పట్టిందా అనుకోకండి. పాక్ గెలవాలని కోరుకునేది వాళ్లపై ప్రేమతో కాదు.. మరోసారి పాకిస్థాన్‌ను టీమిండియా కసితీరా ఓడించాలని. ఆసియా కప్‌లో రెండు విజయాలతో టీమిండియా ఇప్పటికే సూపర్ ఫోర్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ ఏ నుంచి మరో టీమ్‌కు సూపర్ ఫోర్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. భారత్ చేతిలో ఓడిన పాక్, హాంకాంగ్ మిగిలిన ఆ ఒక్క స్పాట్ కోసం పోటీ పడుతున్నాయి. శుక్రవారం మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు సూపర్ ఫోర్‌కు చేరుకుంటారు. గ్రూప్ బీ నుంచి ఇప్పటికే అఫ్ఘనిస్థాన్, శ్రీలంక సూపర్ ఫోర్‌కు చేరుకున్నాయి. హాంకాంగ్‌పై పాకిస్థాన్ విజయం సాధిస్తే.. వాళ్లు కూడా సూపర్ ఫోర్‌కు చేరుకుంటారు.
సూపర్ ఫోర్‌కు చేరుకున్న నాలుగు జట్లు మిగతా జట్లతో ఒక్కొ మ్యాచ్ ఆడుతుంది. దీంతో మరోసారి ఇండియా-పాకిస్థాన్ తలపడే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా మట్టికరిపించింది. మళ్లీ టీ20 వరల్డ్ కప్‌లో గాని ఈ రెండు టీమ్స్ తలపడవు. అప్పటి వరకు ఎందుకు ఆగడం. మరోసారి ఆసియా కప్‌లనే పాక్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకోసమే హాంకాంగ్‌పై పాక్ విజయం సాధించి.. సూపర్ ఫోర్‌కు వచ్చి ఇండియాతో మరోసారి తలపడాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. శత్రువును మరోసారి కసితీరా ఓడిస్తే చూడాలని ఆశపడుతున్నారు. కాగా.. హాంకాంగ్‌పై పాకిస్థాన్ విజయం సాధించే అవకాశం ఎక్కువగానే ఉన్నా.. టీమిండియాతో హాంకాంగ్ ఆడిన తీరు చూస్తే మాత్రం పాక్ చెమటోచగా తప్పేలా లేదు.
టీమిండియా లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్‌ను 15వ ఓవర్ల పాటు కట్టిపడేసింది. అలాగే 192 పరుగులు టార్గెట్‌ను టీమిండియాపై ఛేదిస్తూ.. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్, ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, జడేజా ఉన్న దుర్భేద్యమైన బౌలింగ్ ఎటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి కేవలం 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో హాంకాంగ్ ఓడినా.. అద్భుత పోరాట పటిమతో ప్రశంసలు అందుకుంది. కాగా.. పాకిస్థాన్ హాంకాంగ్‌ను ఎక్కడ తక్కువ అంచనా వేసి.. పుసుక్కున ఓడిపోతే ఆసియా కప్ నుంచి నిష్క్రమించాల్సిందే. అలా జరిగితే మరోసారి భారత్-పాక్ మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు కలగదు. అందుకే హాంకాంగ్‌పై ఎలాగైన పాక్ విజయం సాధించాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ‘వాళ్లు ఇప్పుడు గెలవాలి.. మేం మరోసారి వాళ్లను ఓడించాలి’ ఇదే కాన్సెప్ట్‌తో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ పాక్ గెలుపును కాంక్షిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: బంగ్లాపై ప్రతీకారం తీర్చుకున్న శ్రీలంక! నాగినీ డ్యాన్స్‌తో రిటర్న్ గిఫ్ట్!
Full support to Pakistan today 🥰#AsiaCup2022 #PAKvsHK pic.twitter.com/Mi7DEY6akB
— Sid Malhotra 🇮🇳✨❣️(◍•ᴗ•◍)❤ (@SidMalh7) September 2, 2022
Its a match day😍
Best of luck to Pakistan team❤🤲#PAKvsHK pic.twitter.com/2we0Zgf3a4— Junaid ✨ (@beingBA56) September 2, 2022
Pakistan have an upper hand against Hong Kong in head to head record in the Asia Cup.
Will Hong Kong script history by defeating Pakistan for the first time and qualify for the Super 4s?#CricTracker #PAKvsHK #AsiaCup2022 #Cricket #BabarAzam pic.twitter.com/qN4l520xZJ
— CricTracker (@Cricketracker) September 2, 2022
4th position for the Asia Cup Super 4s is up for grab.
Which side will come out victorious in this decisive encounter?#CricTracker #PAKvsHK #AsiaCup2022 #Cricket #BabarAzam pic.twitter.com/goK3tw0qrV
— CricTracker (@Cricketracker) September 2, 2022