సచిన్ వారసుడిగా క్రికెట్ లోకి అడుగుపెట్టాడు అర్జున్ టెండుల్కర్. తాజాగా అర్జున్ బ్యాటింగ్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అచ్చం యువరాజ్ సింగ్ లా భారీ సిక్స్ లు కొడుతున్నాడు అర్జున్ టెండుల్కర్.
సచిన్ టెండుల్కర్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. టన్నుల కొద్ది పరుగులు, వందల కొంది రికార్డులు.. మాస్టర్ బ్లాస్టర్ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవు. మరి ఇంతటి దిగ్గజ ఆటగాడి కొడుకుగా క్రికెట్ లోకి అడుగుపెట్టాడు అర్జున్ టెండుల్కర్. ఇక సచిన్ వారసుడిగా క్రికెట్ లో రాణించడం అంటే ఆషామాషీ విషయం కాదు. పైగా మిగతా ఆటగాళ్ల కంటే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొవాల్సి ఉంటుంది కూడా. అలాంటి ఒత్తిడితోనే క్రికెట్ లోకి అడుగుపెట్టాడు అర్జున్ టెండుల్కర్. ఇక రంజీ ట్రోఫీలోకి అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ బాదీ.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తాజాగా అర్జున్ టెండుల్కర్ అచ్చం యువరాజ్ సింగ్ లా బ్యాటింగ్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
అర్జున్ టెండుల్కర్.. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ తనయుడిగా క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2021 నుంచి ముంబై ఇండియన్స్ తో ఉన్న అతడికి అవకాశం రాలేదు. తాజాగా ఈ సీజన్ లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు అర్జున్. దాంతో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు అర్జున్ టెండుల్కర్. ఐపీఎల్ లో ఆడిన తొలి తండ్రి, కొడుకులుగా రికార్డు సృష్టించాడు.
ఇక ఇదంతా కొద్దిసేపు పక్కన పెడితే.. తాజాగా అర్జున్ టెండుల్కర్ కు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో ఇంతలా వైరల్ కావడానికి ప్రధాన కారణం.. అర్జున్ టెండుల్కర్ అచ్చం టీమిండియా మాజీ ప్లేయర్, స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ లా బ్యాటింగ్ చేయడం. యువరాజ్ సింగ్ ఎంత స్టైలిష్ గా బ్యాటింగ్ చేస్తాడో మనందరికి తెలిసిందే. ఓ టీ20 లీగ్ లో బ్యాటింగ్ చేసిన అర్జున్.. యువీ షాట్స్ ను అచ్చుగుద్దినట్లు దింపాడు. దాంతో టీమిండియాకు మరో యువరాజ్ దొరికాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.
ఈ వీడియోలో యువీ లాగే ఎంతో ఓపికగా, తన ట్రేడ్ మార్క్ షాట్స్ తో అలరించాడు అర్జున్ టెండుల్కర్. వరుసగా మూడు సిక్స్ లు కొట్టి సిక్సర్ల కింగ్ యువరాజ్ ను గుర్తుచేశాడు. అర్జున్ టెండుల్కర్ కు కోచింగ్ ఇచ్చేది యువరాజ్ తండ్రి అని మనకు తెలిసిన విషయమే. దాంతో అర్జున్ కూడా యువీలానే బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి యువరాజ్ లా బ్యాటింగ్ చేస్తున్న అర్జున్.. భవిష్యత్ లో టీమిండియాకు మరో యువరాజ్ అవుతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సచిన్ కొడుకు సెంచరీకి కారణం యువరాజ్ సింగ్ తండ్రి!