క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఒక దిగ్గజం. ఇండియాలో అయితే అతనే క్రికెట్ గాడ్. అలాంటి లెజెండ్ వారసుడు సైతం క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకుంటే.. అతనిపై భారీగా అంచనాలు ఏర్పడతాయి. తండ్రి స్థాయిని, సాధించిన విజయాలను అందుకోవాలని, అధిగమించాలనే ఒత్తిడి అతనిపై ఉంటుంది. అది ఏ రంగంలోనైనా సహజం. అయితే.. సచిన్ ఏకైక పుత్రుడు అర్జున్ టెండూల్కర్ సైతం క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకోవడంతో.. అతనిపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా రంజీల్లో తొలి సెంచరీ బాదిన అర్జున్ టెండూల్కర్ వార్తల్లో నిలిచాడు. రంజీ ట్రోఫీలోకి అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదడం అందుకు కారణమైతే.. తన తండ్రి సచిన్ 44 ఏళ్ల క్రితం చేసిన ఫీట్‌ను అర్జున్ రిపీట్ చేయడం మరో విశేషం.
1988లో సచిన్ టెండూల్కర్ సైతం తను ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. ఇప్పుడు అర్జున్ సైతం తన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టాడు. అయితే.. సచిన్ ముంబై తరఫున ఆడి సెంచరీ చేస్తే.. అర్జున్ మాత్రం గోవాకు ఆడుతూ సెంచరీ చేశాడు. ముంబైకి చెందిన అర్జున్ టెండూల్కర్ గోవా టీమ్‌కు ఎందుకు మారాడు అనే విషయంపై చర్చ జరుగుతోంది. చాలా కాలంగా ముంబై రంజీ టీమ్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అర్జున్.. ఎంతకీ ఛాన్స్ రాకపోవడంతో ఈ రంజీ సీజన్‌కు ముందు తండ్రి సలహాతో గోవాకు మారాడు. ఇంతకు ముందు జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవా తరఫున మంచి ప్రదర్శన కనబర్చిన అర్జున్‌కు రంజీల్లో ఆడే అవకాశం దక్కింది. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ల్లోనే 207 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులతో 120 పరుగుల చేసి అదరగొట్టాడు అర్జున్.
అయితే.. ఈ రంజీ సీజన్ కంటే ముందు తన కుమారుడి కెరీర్‌ను సీరియస్‌గా తీసుకున్న సచిన్ టెండూల్కర్.. ముంబై నుంచి గోవాకు మార్చాడు. అలాగే.. అర్జున్ టెండూల్కర్‌పై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. యోగ్‌రాజ్ సింగ్ చేతుల్లో పెట్టాడు. మాజీ క్రికెటర్ అయిన యోగ్‌రాజ్ సింగ్.. తన కుమారుడైన యువరాజ్ సింగ్‌ను గొప్ప క్రికెటర్‌గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు. దీంతో తన కొడుకు అర్జున్‌ను యోగ్‌రాజ్‌కు అప్పగించాడు సచిన్. ఈ రంజీ సీజన్‌కు ముందు ఛండీగఢ్‌లో యోగ్‌రాజ్ సమక్షంలో అర్జున్ టెండూల్కర్ ట్రైన్ అయ్యాడు. అర్జున్‌ను మెంటర్‌గా ట్రైన్ చేసిన యోగ్‌రాజ్ సక్సెస్ అయ్యారు. యోగ్‌రాజ్ మెంటరింగ్‌లో ట్రైన్ అయిన అర్జున్ రంజీ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు. అయితే అర్జున్‌కు ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో యోగ్‌రాజ్ సింగ్ అర్జున్‌కు చెప్పిన సూత్రం ఒక్కటే.. నువ్వు సచిన్ కొడుకువన్న విషయం మర్చిపో.. అదే నిన్ను వేరే స్థాయికి తీసుకెళ్తుందని అతనిపై ఉన్న ఒత్తిడిని పొగొట్టారంట యోగ్‌రాజ్. మరి సచిన్ కుమారుడికి యువరాజ్ తండ్రి ట్రైనింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘Forget you are Sachin Tendulkar’s son’: Yograj Singh’s nugget of wisdom that helped Arjun Tendulkar match Sachin’s feat on Ranji debut@sachin_rt @YUVSTRONG12 https://t.co/4Ic9DCKrOz#ArjunTendulkar #YuvrajSingh #RanjiTrophy pic.twitter.com/XURLrxd33J
— Sports Tak (@sports_tak) December 15, 2022
Yograj Singh training Arjun Tendulkar.. exciting pic.twitter.com/JnF054WakF
— Navaldeep Singh (@NavalGeekSingh) September 23, 2022