క్రికెట్‌లో ఒక చేతితో బ్యాటింగ్, మరో చేతితో బౌలింగ్ చేసే వాళ్లను చూసుంటాం. లెప్టాంటెడ్ బ్యాటర్ అయిన భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ.. కుడిచేతితో బౌలింగ్ చేస్తారనేది తెలిసిందే. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఇలాగే కుడి చేతితో బౌలింగ్, ఎడమ చేతితో బ్యాటింగ్ చేస్తాడు. ఇక బ్యాటింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి కొందరు బ్యాట్స్‌మన్ కుడి చేతితో బ్యాటింగ్ చేసినా.. అవసరమైనప్పుడు ఎడమ చేతితో రివర్స్ స్వీప్‌లు కొడుతుంటారు. దీని వల్ల బౌలర్‌కు బంతిని ఎక్కడ సంధించాలో అర్థంకాక అయోమయంలో పడిపోతారు. వీటిని పక్కనబెడితే.. టీమిండియా బ్యాట్స్‌మన్ హనుమ విహారి ఎడమ చేతితో బ్యాటింగ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన విహారి.. ఎడమ చేతితో ఎందుకు బ్యాటింగ్ చేశాడనే కదా మీ డౌట్? అసలు ఏమైందంటే.. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టుతో ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర బ్యాటింగ్ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్ విహారికి గాయమైంది. ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్ విసిరిన బాల్ విహారి ఎడమ చేతి మణికట్టుకు తగిలింది. దీంతో అతడు తల్లడిల్లాడు. విహారి బ్యాటింగ్ కొనసాగించడం కష్టమేనని అందరూ భావించారు. కానీ పట్టువదలని విహారి.. ఎడమ చేతి వాటంతో బ్యాటింగ్‌ను కొనసాగించాడు.
గాయమైనప్పటికీ లెఫ్ట్ హ్యాండ్ స్టాండ్స్ తీసుకుని.. ఎడమ చేతిని వెనక్కి ఉంచి, కుడి చేతితో విహారి బ్యాటింగ్ కొనసాగించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంత నొప్పిలోనూ ఎలా ఆడావంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విహారి ఓ ఫైటర్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి ఆంధ్ర 9 వికెట్ల కోల్పోయి 379 పరుగులు చేసింది. విహారి (27 బ్యాటింగ్) ఇంకా క్రీజులోనే ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఇంకెన్ని పరుగులు చేస్తాడో చూడాలి. మరి, చేతికి గాయమైనా బ్యాటింగ్ కొనసాగించిన విహారి పోరాటస్ఫూర్తిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
In the Quarter-final of Ranji Trophy, Andhra 9 down, Hanuma Vihari fracture his wrist and decided to bat left-handed.
The fighter, Vihari. pic.twitter.com/guDUIjESp9
— Johns. (@CricCrazyJohns) February 1, 2023