సోషల్ మీడియా వచ్చాక.. తమ భావాలను స్వేచ్చగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు జనాలు. అదేవిధంగా సెలబ్రిటీల విషయానికి వస్తే చిట్ చాట్ లు చేస్తూ.. అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది సెలబ్రిటీల భార్యలు తమ భర్తలపై తమకు ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూంటారు. తాజాగా అలాంటి ప్రేమనే పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ వెల్లడించింది.. టీమిండియా స్టార్ క్రికెటర్ అజింక్యా రహానే భార్య రాధికా దోపావ్ కర్. ప్రస్తుతం ఆమె ఇన్ స్టా లో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మరింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అజింక్యా రహానే-రాధిక.. టీమిండియా మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్. చిన్నతనం నుంచే వీరు స్నేహితులు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో 2014లో పెళ్లి ద్వారా ఒక్కటైయ్యారు. ప్రస్తుతం వీరికి ఓ కుమార్తే కూడా ఉంది. అయితే ఈ రోజు (సెప్టెంబర్ 26) తమ పెళ్లి రోజు కావడంతో.. తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా చెప్పింది. రాధిక తన బ్లాగ్ లో ఈ విధంగా రాసుకోచ్చింది.”ఈ రోజుతో మనం వివాహ బంధంలోకి అడుగుపెట్టి 8 సంవత్సరాలు అయ్యింది. నాకు నువ్వు 11 సంవత్సరాల వయసు నుంచే తెలుసు! అయినప్పటికీ నేను కలలో కూడా ఊహించలేదు నిన్ను పెళ్లి చేసుకుంటానని.. అందుకే అంటారేమో మనం అనుకున్నవే జీవితంలో కొన్ని జరుగుతాయని, హ్యాపీ యానివర్సరీ డియర్” అంటూ రాసుకొచ్చింది.
రహానే దులీప్ ట్రోఫీలో సిరీస్ బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం రాధిక గర్భిణీ.. అక్టోబర్ లో తను మరో బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లు ఆమె కొన్ని రోజుల క్రితమే తెలిపింది. ప్రస్తుతం రాధిక పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్స్ ఇంత మంచి భార్య దొరికినందుకు రహానే చాలా లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దులీప్ ట్రోఫీలో డబుల్ సెంచరీతో రహానే దుమ్ము రేపాడు. అదీ కాక తన క్రీడాస్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాడు. స్లెడ్జింగ్ చేస్తున్న కారణంగా తన టీమ్ ప్లేయర్ అయిన యువ ఆటగాడు అయిన యశస్వీ జైస్వాల్ ను మైదానం నుంచి బయటకి పంపించాడు. దీంతో అతడి క్రీడాస్పూర్తిని అందరు ప్రశంసిస్తున్నారు.