ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శనివారం(సెప్టెంబర్ 24)న ఈ రెండు జట్ల మధ్య చివరి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 45.4 ఓవర్లలోనే 169 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన(50), దీప్తి శర్మ(68), పూజ(28) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను సైతం టీమిండియా బౌలర్లు పరుగులు చేయనియలేదు. 118 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ.. చార్లీ డీన్(47) పోరాటంతో ఇంగ్లండ్ విజయపుటంచుల దాకా వచ్చింది.
కానీ.. ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో మ్యాచ్ ఊహించని విధంగా ముగిసింది. ఇంగ్లండ్ విజయానికి 40 బంతుల్లో 16 మాత్రమే కావాలి. చేతిలో మాత్రం ఒక్కటే వికెట్ ఉంది. ఇన్నింగ్స్ 44వ ఓవర్ వేసేందుకు వచ్చిన దీప్తి శర్మ.. మూడో బంతిని వేసేందుకు సిద్ధమైంది. బాల్ రిలీజ్ చేసే టైమ్‌కు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న చార్లీ డీన్ క్రీజ్ వదిలి చాలా దూరం వెళ్లింది. ఇది గమనించిన దీప్తి శర్మ బాల్‌ను రిలీజ్ చేయకుండా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను గిరాటేసింది. రూల్స్ ప్రకారం అంపైర్ డీన్‌ను రనౌట్‌గా ప్రకటించడంతో 153 పరుగుల వద్ద తమ చివరి వికెట్‌ను కోల్పోయి మ్యాచ్ ఓడిపోయింది. దీంతో టీమిండియా 3-0తో వన్డే సిరీస్‌ను కైవలం చేసుకుంది.
కాగా.. దీప్తి శర్మ చేసిన మన్కడింగ్(రనౌట్)ను ఇంగ్లండ్ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. జెంటిల్‌మెన్ గేమ్‌లో ఇది అనైతికం అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అలాగే రనౌట్ అయిన చార్లీ డీన్ ఏదో జరగరాని ఘోరం జరిగినట్లు గ్రౌండ్‌లోనే ఏడ్చుకుంటూ పెవిలియన్ చేరింది. ఈ విషయంపై ఇంగ్లండ్ ఆటగాళ్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, సామ్ బిల్లింగ్స్ సైతం స్పందించారు. దీప్తి శర్మ చేసింది ముమ్మాటికీ కరెక్ట్ కాదని, క్రికెట్ బుక్స్‌లో ఇది రూల్ అయినా నైతికంగా క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని తప్పుబట్టారు. కానీ.. ఇండియన్ క్రికెట్ అభిమానులు మాత్రం ఇంగ్లండ్ ఆటగాళ్లును ఒక రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఆటలో నైతికత గురించి, క్రీడా స్ఫూర్తి గురించి బౌండరీ కౌంట్‌తో వరల్డ్ కప్ తీసుకున్న వాళ్లే చెప్పాలంటూ సెటైర్లతో విరుచుకుపడుతున్నారు.
2019లో ఇంగ్లండ-న్యూజిలాండ్ మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా అందులోనే టై అయింది. దీంతో ఎక్కువ బౌండరీలు కొట్టిన కారణంగా ఇంగ్లండ్‌ను వరల్డ్ కప్ విజేతగా అంపైర్లు ప్రకటించారు. క్రికెట్‌లో ఇలాంటి ఒక రూల్ ఉందని అప్పటి వరకు చాలా మంది క్రికెట్ అభిమానులకు తెలియదు. న్యూజిలాండ్‌కు అన్యాయం జరిగిందని మొత్తం క్రికెట్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తి చేసింది. ఇంగ్లండ్ మాత్రం మాకు రూల్ ప్రకారమే కప్ వచ్చిందంటూ సమర్థించుకుంది. ఇప్పుడు మాత్రం రూల్ ప్రకారం దీప్తి శర్మ మన్కడింగ్(రనౌట్) చేస్తే మాత్రం అనేతికం అంటూ గోల చేస్తున్నారంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
గతంలో ఇంగ్లండ్ చేసిన ఘోర తప్పిదాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ.. ఇది మీ నైతికత, నిజాయితీ అంటూ ఏకిపారేస్తున్నారు. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో రన్స్ కోసం వెళ్తున్న ఒక బ్యాటర్‌ను బౌలర్ ఢీకొట్టి కిందపడేస్తాడు. ఫీల్డర్ ఆ లోపు బాల్ కీపర్‌కు ఇచ్చి రనౌట్ చేస్తారు. ఇంకో మ్యాచ్‌లో అయితే ఇంగ్లండ్ కీపర్ స్మృతి మంధాన క్యాచ్‌ను నేలపాలు చేసి.. ఏమి ఎరగనట్టు నిల్చుంటుంది. ఆమె క్యాచ్‌ను క్లీన్‌గా పట్టిందని అంపైర్ పొరపడి మంధానను అవుట్‌గా ప్రకటిస్తాడు. కానీ.. మంధాన ఇంకా మైదానం దాటకముందే.. ఆమె క్యాచ్ సరిగా పట్టేలేదని, బాల్ నేలపై పడితే మళ్లీ తిరిగి తీసుకున్న విషయం రిప్లేలో క్లియర్‌గా తెలుస్తుంది.
అప్పుడు కీపర్ వెనక్కు తిరిగి క్యాచ్ తీసుకోవడంతో అంపైర్ చూడలేకపోయారు. కానీ.. ఇంగ్లండ్ కీపర్‌కు క్యాచ్ నేలపాలైన విషయం తెలిసినా ఆమె ఒప్పుకోకుండా తొండి ఆట ఆడుతుంది. ఈ వీడియోను సైతం నెటిజన్లు షేర్ చేస్తూ.. ఇది మీ ఆట, క్రీడా స్ఫూర్తి, నైతికత అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. రూల్ ప్రకారం దీప్తి చేసింది వందశాతం కరెక్ట్ అంటూ మద్దతు తెలుపుతున్నారు. అయినా వరల్డ్ కప్‌ను బౌండరీ కౌంట్‌తో తీసుకుని రూల్స్ మాట్లాడే వాళ్లు.. ఇప్పుడెందుకు ఇలా మొత్తుకుంటున్నారు? అంటే మీకో న్యాయం వేరే వాళ్లకు ఇంకో న్యాయమా? అంటూ క్రికెట్ అభిమానులు ఇంగ్లండ్ ఆటగాళ్లను ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
How it can be fair… though the laws of cricket allow you to do that but what about the spirit of the game.
It doesn’t sound good. And today’s World cricket friendly. #SpiritOfCricket #Deepthisharma #RunOut pic.twitter.com/oNOeUQMXp9— Devendra Singh Tomar (@dst_lucky) September 24, 2022
Revenge Taken Successfully by @Deepti_Sharma06 🙌😌#Deepthisharma Well Done👏#mankading #INDWvsENGW #ENGvIND #StuartBroad #England #India #Mankad pic.twitter.com/4Wv0uf20Cr
— Nandkishor (@NKishorNK) September 25, 2022
England Cricket!! 😂😂😂 #Deepthisharma
When you play When you want
as per Law!! Sprite in the game!! pic.twitter.com/3j1adQFCyr— SuseeMaha❤️🔥 (@SuseeMaha16) September 25, 2022
Cheaters doesnt follow the rules of the game hence they whine when someone follows the rules as they should be.
Well done Deepthi Sharma 🔥 https://t.co/8gTwso40P8
— Arya Harish (@iAryaHarish) September 24, 2022
ఇది కూడా చదవండి: నేనే ఏం చేయాలో రోహిత్, రాహుల్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి సైగలతో చెప్పారు: కోహ్లీ