ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా ఒక బంతి మిగిలి ఉండగానే గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
‘నేను వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేయడమే జట్టుకు మంచి చేస్తుంది. నా ఎక్స్‌పిరీయన్స్ జట్టుకు ఉపయోగపడుతుంది. నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక సారి డగౌట్ వైపు చూసినప్పుడు రాహుల్ భాయ్, రోహిత్ నాకు సైగలు చేశారు. నన్ను చివరి వరకు బ్యాటింగ్ చేయమని వారిద్దరూ నాకు చెప్పారు. నేను అదే చేసి సక్సెస్ అయ్యాను. సూర్య గురించి చెప్పాలంటూ మాటల్లేవ్. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సూర్య ఏ పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేస్తాడు. ఆసియా కప్‌లో అతను ఎలాంటి బ్యాటింగ్ చేశాడో చూశాం. గత ఆరు నెలలుగా అతని ఆటతీరు చూస్తునే ఉన్నాను. బంతిని బలంగా బాదుతాడు. సూర్యకు దేవుడిచ్చిన వరం టైమింగ్. అతను ఆడుతున్న షాట్లను నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండి చూస్తూ.. ఆశ్చర్యపోయా.
ఇక స్పిన్నర్ ఆడమ్ జంపా నా స్కోరింగ్ రేట్‌ను తగ్గించే ప్రయత్నం చేశాడు. నేను కాస్త లెగ్‌సైడ్ జరిగి ఆఫ్‌సైడ్ షాట్లు ఆడాను. చివరి ఓవర్‌లో కేవలం 4 లేదా 5 పరుగులు మాత్రమే ఉండాలని భావించాం. కానీ అలా జరగనందుకు చాలా నిరాశ చెందా. చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమైన దశలో తొలి బంతికే బౌండరీ వస్తే బాగుండదని కొట్టా.. ఆ సిక్స్ టీమ్‌కు ఎంతో హెల్ప్ చేసింది. ఈ విజయంలో నా రోల్‌పై సంతోషంగా ఉన్నాను. నేను కొంత రెస్ట్ తీసుకుని వచ్చి నెట్స్ ప్రాక్టీస్ చేశా. అలాగే నా ఫిట్‌నెస్‌పై కష్టపడి పని చేయడంతోనే ఈ ఫలితం వస్తుంది. టీమ్ కోసం ఇలాంటి మరిన్ని ప్రదర్శన ఇవ్వాలని అనుకుంటున్నా’ అని కోహ్లీ పేర్కొన్నాడు. మరి కోహ్లీ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🗨️🗨️ I am enjoying my process at the moment: @imVkohli
Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/7JlLTyDj6y
— BCCI (@BCCI) September 25, 2022
ఇది కూడా చదవండి: మ్యాక్సీ రనౌట్‌పై సర్వత్రా చర్చ.. అది ఔటా- నాటౌటా?