సాధారణంగా పెళ్లిల్లు ఆడ, మగ మధ్య జరుగుతాయి. వారి వారి సాంప్రదాయాల ప్రకారం ఘనంగా పెళ్లిల్లు జరుపుకుంటారు. కానీ అక్కడ ఓ యువతి కాస్త భిన్నంగా ఆలోచించి తనను తానే పెళ్లి చేసుకుంది. ఆ వివాహం జరిగి సంవత్సరం పూర్తైనందునా వివాహ వార్షికోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతోంది.
యువతీ యువకులు పెళ్లీడుకు వచ్చిన తరువాత వారి పేరెంట్స్ మంచి వరున్ని లేదా వధువుని చూసి పెళ్లి జరిపిస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత మంది అబ్బాయిలు అమ్మాయిలు వారికి నచ్చిన వ్యక్తిని ఎంచుకుని ప్రేమించుకుని, డేటింగ్ చేసి ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడిన తర్వాత వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఇంకొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇద్దరు యువతులు, లేదా ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్న ఘటనలు కూడా మనం చూసాము. కానీ ఇక్కడ మాత్రం ఓ యువతి తనను తానే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మొదటి వివాహవార్షికోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.
గుజరాత్ కు చెందిన క్షమ బిందు అనే యువతి ఏడాది కిందట తనను తానే వివాహం చేసుకుంది. ఈ యువతి వివాహం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్షమ బిందు ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకుందో మరి సాధారణ వివాహాం చేసుకుంటే కుటుంబ బాధ్యతలు మోయాల్సి వస్తుందని అనుకుందేమో మరి తనను తానే పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ఏడాది కిందట సాధారణ పెళ్లి కూతురులాగానే వివాహ వస్త్రాలు ధరించి, నుదుటన సింధూరం దిద్దుకుని సన్నిహితుల మధ్య స్వీయ వివాహం చేసుకుంది.
అయితే తాజాగా క్షమ బిందు తన పెళ్లి జరిగి ఏడాది పూర్తవడంతో మొదటి పెళ్లి రోజు వేడకను జరుపుకుని మరోసారి వార్తల్లో నిలిచింది. తన పెళ్లి రోజు వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తన ఎదపై ఉన్న టాటూలను కనబరుస్తూ, తన బర్త్ డే, పెళ్లి రోజు వేడుకలకు సంబందించిన ఫొటోలను ఆ వీడియోలో పొందుపరిచింది. దీంతో ఆ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్షమ బిందుకు వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.