టీ20 ఫార్మాట్‌లో టీమిండియా టెస్ట్ టీం వైస్ కెప్టెన్ అంజిక్యా రహానే అదరగొడుతున్నాడు. దేశవాళీ క్రికెట్ టోర్నీ ముస్తాక్‌అలీ ట్రోఫీ కోసం జరుగుతున్న మ్యాచ్‌ల్లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానే తన సహజసిద్ధమైన ఆటను పక్కన పెట్టి దూకుడు ప్రదర్శిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విఫలమవ్వడం, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఉన్ననేపథ్యంలో రహానే ఫామ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫామ్ చూసి రహానే టీమ్ ఉంటే బాగుండేదని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇంతవరకు ముస్తాక్ అలీ ట్రోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన రహానే ఓపెనర్‌గా వస్తూ వరుసగా 75, 54, 17, 69, 71 పరుగులు చేసి భీకర ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌లో 4 హాఫ్ సెంచరీలు చేసి తనలో దూకుడు తగ్గలేదని నిరూపిస్తున్నాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌కు ఆడిన రహానే ఓపెనర్‌గా జట్టుకు మంచి ఆరంభాలు ఇచ్చేవాడు. ఇప్పుడు దేశవాళీ టోర్నీల్లో కూడా అదరగొడుతున్నాడు. ఈ నెల 17 నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాలో రహానే లేనప్పటికీ.. టెస్ట్ సిరీస్‌కు మాత్రం టీమిండియాలో ఉంటాడు. ఇదే ఫామ్‌ను కొనసాగించి టెస్ట్ సిరీస్‌లో రాణించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి రహానే ఫామ్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నన్ను తప్పిస్తే ద్రావిడ్ వచ్చాడు.. అలాగే రహానేను తప్పిస్తే..