టీమిండియా యంగ్‌స్టర్ వెంకటేశ్ అయ్యర్ నడవలేని స్థితిలో ఉన్నాడు. ఎడమకాలికి పెద్ద కట్టుతో లెగ్ వాకర్ సహాయంతో నడుస్తున్నాడు. ఈ ఫొటోను ఐపీఎల్ ఫ్రాంచైజ్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది. దీంతో అయ్యర్‌కు ఏమైందని క్రికెట్ అభిమానులు కంగారు పడుతున్నారు. కాగా.. ముస్తక్ అలీ ట్రోఫీ 2022లో భాగంగా వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతను ఈ టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. అయ్యర్ కాలి గజ్జల్లో ఎముక చిట్లినట్లు తెలుస్తుంది. […]
ఇండియాలోనే అత్యంతవేగంగా బౌలింగ్ చేసే బౌలర్, గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బుల్లెట్లను తలపించే బంతులను వేసే ఉమ్రాన్ మాలిక్‌ను టీ20 వరల్డ్ కప్ 2022కు ఎంపిక చేయలేదు. ఐపీఎల్ 2022లో అతని వేగానికి, ప్రదర్శనకు ఫిదా అయిపోయిన టీమిండియా సెలెక్టర్లు వెంటనే అతన్ని జాతీయ జట్టులోకి తీసుకున్నారు. కానీ.. ఉమ్రాన్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో అతనికి మరికొంత సమయం ఇవ్వాలని భావించిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. వరల్డ్ కప్‌కు […]
టీ20 ఫార్మాట్‌లో టీమిండియా టెస్ట్ టీం వైస్ కెప్టెన్ అంజిక్యా రహానే అదరగొడుతున్నాడు. దేశవాళీ క్రికెట్ టోర్నీ ముస్తాక్‌అలీ ట్రోఫీ కోసం జరుగుతున్న మ్యాచ్‌ల్లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానే తన సహజసిద్ధమైన ఆటను పక్కన పెట్టి దూకుడు ప్రదర్శిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విఫలమవ్వడం, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఉన్ననేపథ్యంలో రహానే ఫామ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫామ్ చూసి రహానే టీమ్ ఉంటే బాగుండేదని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో […]