ఇండియాలోనే అత్యంతవేగంగా బౌలింగ్ చేసే బౌలర్, గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బుల్లెట్లను తలపించే బంతులను వేసే ఉమ్రాన్ మాలిక్‌ను టీ20 వరల్డ్ కప్ 2022కు ఎంపిక చేయలేదు. ఐపీఎల్ 2022లో అతని వేగానికి, ప్రదర్శనకు ఫిదా అయిపోయిన టీమిండియా సెలెక్టర్లు వెంటనే అతన్ని జాతీయ జట్టులోకి తీసుకున్నారు. కానీ.. ఉమ్రాన్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో అతనికి మరికొంత సమయం ఇవ్వాలని భావించిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. వరల్డ్ కప్‌కు ఎంపిక చేయలేదు. నెట్ బౌలర్‌గా ఎంపిక చేసినా.. వీసా కారణాలతో అతను ఆస్ట్రేలియా వెళ్లలేకపోయాడు. ఇలా టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనకపోవడంపై కోపంగా ఉన్న ఉమ్రాన్ మాలిక్.. ఆ కసినంతా దేశవాళీ టోర్నీలో చూపిస్తున్నట్లు ఉన్నాడు.
ముస్తక్ అలీ ట్రోఫీ 2022లో భాగంగా మహారాష్ట్ర-జమ్ముకశ్మీర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగాడు. 150 కిమీ వేగంతో బుల్లెట్ లాంటి బంతులను సంధిస్తూ.. బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఉమ్రాన్ 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ వేసిన ఒక బంతి అత్యంత వేగంగా వికెట్లను పడగొట్టింది. ఉమ్రాన్ దెబ్బకు మిడిల్ వికెట్ లేచి అంతదూరంలో పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కలేదనే ఉమ్రాన్ మాలిక్ కసితో ఇలా బౌలింగ్ చేస్తున్నాడని నెటిజన్లు సరదాగా పేర్కొంటున్నారు. కాగా.. ఈ వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది.
అయితే ఉమ్రాన్ మాలిక్‌ను టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాల్సిందే వాదనలు చాలా వినిపించాయి. అతని వేగానికి ఆస్ట్రేలియా పిచ్‌లు సరిగ్గా సరిపోతాయని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. అలాగే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దిగ్గజ బౌలర్ బ్రెట్‌లీ సైతం.. ఉమ్రాన్ మాలిక్ లాంటి బెస్ట్ బౌలర్‌ను టీమిండియా గ్యారేజ్‌లో వదిలేసిందని సెటైరికల్ కామెంట్ కూడా చేశాడు. కాగా.. టీ20 వరల్డ్ కప్ 2022 ప్రణాళికల్లో ఉమ్రాన్ మాలిక్‌ను పరిగణంలోకి తీసుకున్న రాహుల్ ద్రవిడ్ పలు అంతర్జాతీయ సిరీస్‌ల్లో అతన్ని పరీక్షించాడు. కానీ.. ఉమ్రాన్ నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. దీంతో ఉమ్రాన్‌ను మరింత పదుపు పెట్టాల్సిన అవసరం ఉందని భావించిన ద్రవిడ్.. అతన్ని పక్కన పెట్టినట్లు సమాచారం.
The #JammuExpress has hit max speed in #SMAT2022, shattering the wickets consistently 🔥#OrangeArmy #SunRisersHyderabad | @umran_malik_01 pic.twitter.com/aVlnNjlCcI
— SunRisers Hyderabad (@SunRisers) October 18, 2022
ఇది కూడా చదవండి: ధోని చెప్పిన ఆ మాటే.. నా జీవితాన్ని మార్చేసింది: హార్దిక్ పాండ్యా