2022 సంవత్సరం టీమిండియాకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఐసీసీ టోర్నీల్లో ఒక్కటి కూడా గెలవలేక పోయింది. దాంతో ఈఏడాది టీమిండియాపై వచ్చినన్ని విమర్శలు ఎప్పుడూ రాలేదనుకుంటా బహుశా. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలను గెలవలేక చేతులెత్తేసింది. అయితే ఇన్ని నిరాశల మధ్య టీమిండియాకు ఓ ఊరటనిచ్చే విషయం ఒకటుంది. అదేంటంటే.. ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో టీమిండియానే అగ్రస్థానంలో నిలిచింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
2022 సంవత్సరం టీమిండియాకు ఓ పీడకలగానే వర్ణించవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది భారత జట్టు ప్రతిష్టాత్మకమైన ఒక్క టైటిల్ ను కూడా సాధించలేకపోయింది. ఆసియా కప్ లో బౌలింగ్ వైఫల్యంతో దారుణంగా ఓటమి చవిచూసిన టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ లో నైనా సత్తా చాటుతుందని అందరు భావించారు. కానీ అనూహ్యంగా టీ20 వరల్డ్ కప్ లో కూడా సెమీస్ లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. దాంతో ఇంటా బయట భారత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీమ్ కూర్పు పై కెప్టెన్ల మార్పుపై పెద్ద ఎత్తునే దుమారం రేగింది. వీటన్నింటి నడుమ టీమిండియా ఓ రికార్డును క్రియేట్ చేసింది 2022లో.
అదేంటంటే.. టీమిండియా ఈ ఏడాదిలో 46 విజయాలు సాధించి రికార్డ్ సాధించింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఒకే క్యాలెండర్ ఇయర్ లో 2003లో 38 విజయాలు సాధించి ఆసిస్ అగ్రస్థానంలో ఉండేది. తాజాగా ఆ రికార్డ్ ను టీమిండియా బద్దలు కొట్టింది. ఈ ఏడాది 46 విజయాలు సాధించింది. అయితే 2017 లో కూడా టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి 37 విజయాలు సాధించింది. ఈ గణాంకాలలో ఇండియా-ఆస్ట్రేలియాలే ఉండటం విశేషం. అయితే ఎన్ని మ్యాచ్ లు గెలిస్తే ఏం లాభం.. అసలైన కప్ లు గెలవాలి గానీ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Most matches won by a team in a calendar year across formats
46 -India(2022)
38 -Australia(2003)
37 -India(2017)
35 -Australia(1999)
35 -India(2018)— CricTracker (@Cricketracker) December 30, 2022