పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అత్యాచార ఆరోపణలతో పాటుగా లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా పాక్ సీనియర్ స్పిన్నర్ యాసిర్ షాపై రేప్ కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ఇస్లామాబాద్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికను యాసిర్ షా, అతని స్నేహితుడు ఫర్షాన్ లు లైంగికంగా వేధించిన కారణంగా కేసు నమోదైనట్లు సమాచారం.
‘యాసిర్ షా స్నేహితుడు ఫర్షాన్ తనని కిడ్నాప్ చేసి.. తుపాకీతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని బాలిక ఫిర్యాదులో తెలిపింది. అంతేగాక అత్యాచారానికి సంబంధించిన వీడియోలు తీసి.. అవి చూపి బ్లాక్ మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు పేర్కొంది.ఆ సమయంలో ఫర్షాన్‌కి యాసిర్ షా సాయం చేశాడు. తన పై కేసు పెట్టినా, ఈ విషయాన్ని బయటపెట్టినా నీ వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించారు. చివరికి యాసిర్ షాను వాట్సాప్ ద్వారా.. అతని స్నేహితుడు ఫర్షాన్ నుంచి కాపాడాలని వేడుకున్నాను. ఈ విషయంలో యాసిర్ షా సాయం చేయకపోగా.. విషయాన్ని ఇంతటితో వదిలేయాలని హెచ్చరించాడు. అంతేగాక తన స్నేహితుడు ఫర్షాన్ పై పోలీసు కంప్లైంట్ ఇవ్వకుండా ఉండేందుకు.. ఓ ఫ్లైట్ తో పాటు 3 ఏళ్లకు సరిపోయే ఖర్చులను కూడా ఇస్తానని మభ్యపెట్టినట్లు బాధిత బాలిక ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
అయితే.. యాసిర్ షా పై ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ధృవీకరించింది. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్ల పై కేసు నమోదైనట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై పీసీబీ విచారణ చేస్తోంది. అసలు నిజాలేంటో బయటికి వచ్చేదాకా ఈ విషయంపై మాట్లాడదలుచుకోలేదని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. 35 ఏళ్ల యాసిర్ షా, తన పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు స్పందించలేదు.