ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పక్కలో బళ్లెంలా మారారు ఆయన సోదరి వైఎస్ షర్మిళ. వైఎస్సార్ మరణాంతరం జగన్ సొంతంగా పార్టీ పెట్టినప్పుడు అన్నకు సపోర్టుగా ఉన్న షర్మిళ.. జగన్ జైలులో ఉన్న సమయంలో పాదయాత్ర కూడా చేశారు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకు అనూహ్యంగా తెలంగాణలో పార్టీ పెట్టారు. జగన్‌తో విభేదాల కారణంగానే సొంతం పార్టీ పెట్టినట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. కానీ షర్మిళ ఊహించిన స్పందన మాత్రం ఆమె పార్టీకి తెలంగాణలో రాలేదు. ఈ నేపథ్యంలో కుటుంబంలో విభేదాలు, షర్మిళ కొత్త పార్టీ, బ్రదర్ అనిల్ ఆంధ్రలో పార్టీ పెట్టేందుకు సన్నాహాలపై వైఎస్సార్ చెల్లెలు వైఎస్ విమల సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ప్రత్యేకంగా షర్మిళ పార్టీ పెట్టడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్ ఎంతో కష్టపడి, అవమానాలు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తెచ్చిన తర్వాత షర్మిళ తనకు కూడా అధికారం కావాలని కోరుకుందని, అందులో తప్పులేదని ఆమె అన్నారు. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఆమె కూడా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లిందని.. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఓపిక పట్టాల్సిందని అన్నారు. తొందరపడి పార్టీ పెట్టినట్లు వైఎస్ విమల అభిప్రాయపడ్డారు. ఇక ఆస్తుల పంపకం గురించి స్పందిస్తూ.. ఆస్తులన్ని ఈడీ జప్తులోనే ఉన్నాయని వాటిని ఎలా పంచుతారని ఆమె ప్రశ్నించారు.
కంపెనీల్లో లాభాలు మాత్రమే తీసుకునే వీలుందని.. అలాగే షర్మిళకు వచ్చే వాటా వెళ్తుందిన ఆమె పేర్కొన్నారు. దాంతోనే ఆమె పార్టీ పెట్టి, నడిపింస్తుందని వెల్లడించారు. అలాగే ఆంధ్రలో బ్రదర్ అనిల్ పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. నో కామెంట్ అంటూ దాటవేశారు. అలాగే వైఎస్ జగన్ ముందు ఎవ్వరూ నిలవలేరని స్పష్టం చేశారు. ఆంధ్రలో పేదలు చాలా మంచి చేస్తున్నాడని అందుకే మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతాడని ధీమా వ్యక్తం చేశాడు. మరి వైఎస్ విమల చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఏపీలోనూ వై.ఎస్. షర్మిల పార్టీ! జగన్ పై ఉండవల్లి మాస్టర్ ప్లాన్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.