వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 238వ రోజు జనగాం జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది.
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు తలపెట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రస్తుతం జనగామా జిల్లాలో కొనసాగుతోంది. ఈ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఆమె.. ప్రజలను అడిగి స్థానిక సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. అంతేకాక సమస్యల పరిష్కారానికి హమీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు షర్మిల. రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంట్, ఉద్యోగాలు, సున్నా వడ్డీకే రుణాలు, దళితులకు మూడు ఎకరాల భూమి, పోడు పట్టాల పంపిణీ జరగలేదని కేసీఆర్ పాలపై షర్మిల విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కేసీఆర్ పాలన బాగుందటూ వైఎస్ షర్మిలపై ఓ యువకుడు సీరియస్ అయ్యాడు. అతడు అడిగిన ప్రశ్నలకు షర్మిల ఓపికగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 238వ రోజు జనగాం జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో కొనసాగింది. ఈ క్రమంలో ప్రజలతో మాట్లాడుతూ షర్మిల తన పాదయాత్రను కొనసాగించారు. ఈ క్రమంలో కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అందడం లేదని, తాము ఎలా బ్రతుకుతున్నమో కూడా పట్టించుకొనే వాళ్ళు లేరు అంటూ షర్మిల దృష్టికి స్థానిక ప్రజలు తీసుకువచ్చారు. రెండు సార్లు కేసీఆర్ అధికారంలో వచ్చిన కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని.. లక్ష లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే పాదయాత్రలో భాగంగా ఓ గ్రామంలో ప్రజలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఓ యువకుడు కేసీఆర్ పాలన బాగుందంటూ షర్మిలపై సీరియస్ అయ్యాడు. అతడు మాట్లాడుతూ.. “మేడమ్ మీరు అడిగే ప్రశ్నలకు మా ఊరి వారు ఒక్కరూ సమాధానం చెప్పడం లేదు. వేరే ఊరి నుంచి మీతో పాటు వచ్చిన వాళ్లు మాత్రమే మాట్లాడుతున్నారు. మా ఊరి వారిని అడగండి చెప్తారు” అంటూ యువకుడు వైఎస్ షర్మిలను ప్రశ్నించాడు. అయితే నువ్వు చెప్పంటూ షర్మిల ఆ యువకుడికి మైక్ ఇప్పించింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎన్ని వచ్చాయని షర్మిల ప్రశ్నించగా.. ఇళ్లు అయితే రాలేదు కానీ నీళ్లు వచ్చాయంటూ ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు.
ఇదే సమయంలో అతడి పక్కకు తీసుకెళ్తున్న తోటి వారిని షర్మిలా ఆపారు. ఆ యువకుడిని ఉండనివ్వండి అంటూ అక్కడి వారికి తెలిపింది. అంతేకాక నీళ్లు ఎవరిచ్చారయ్యా? అని ప్రశ్నిస్తూనే రాజశేఖర్ రెడ్డి గారు ఎస్ఆర్ఎస్ స్టేజ్-2 పూర్తి చేయడంతో.. ఈ నియోజకవర్గానికి నీళ్లు వస్తున్నాయని ఆమె తెలిపారు. అలానే కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు. ప్రస్తుతం ఆ షర్మిలతో ఆ యువకుడు చేసిన వాగ్వాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వైఎస్ షర్మిల పై సీరియస్ అయిన యువకుడు..కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను..
FULL VIDEO – https://t.co/Lg4HIoXd4H#YSSharmila #YSRTP #Telangana #CMKCR #YSSharmilaPadayatra #NTVTelugu pic.twitter.com/tRp4GPvcp6
— NTV Telugu (@NtvTeluguLive) February 15, 2023