ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు మాజీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక చంద్రబాబు సొంత వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ గురుంచి అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో లాభాలతో ఈ సంస్థ దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు మోహన్ బాబు హెరిటేజ్ సంస్థపై, ఆయన అందులో పెట్టిన పెట్టుబడుల గురుంచి కొన్ని సంచలన అంశాలను చాలా ఏళ్ల తర్వాత వెళ్లగక్కాడు.
హెరిటేజ్ సంస్థ ఆరంభంలో చంద్రబాబు కన్నా అందులో నేనే ఎక్కువ వాటాలు కల్గి ఉన్నానని తెలిపారు. అయితే కాల క్రమేణ చంద్రబాబు మోసం చేసి ఆ సంస్థ నుంచి నన్ను బయటకు పంపాడంటూ సంచలన నిజాలు బయటకు తెలిపాడు. ఇక ఇదే విషయమై అప్పటీ సీఎం స్వర్గీయ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద విన్నవించుకున్నానని అన్నారు. అయితే అప్పుడు సొంత మేన మామనే వెన్ను పోటు పొడిచిన ఘనుడు చంద్రబాబని, నిన్ను మోసం చేయటంలో వింతేముందని వైఎస్సాఆర్ అన్నారని మోహన్ బాబు తెలిపారు.
దీంతో పాటు అన్నగారైన నందమూరి తారకరామారావు నన్ను తెలుగు దేశం పార్టీలోకి ఆహ్వానించి రాజ్యసభ టికెట్‌తో సత్కరించారని మోహన్ బాబు తెలిపారు. ఇక ఆ విషయాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు నువ్వు రాజకీయాలకు పనికి రావంటూ పార్టీ నుంచి గెంటేశారని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. చాలా ఏళ్ల తర్వాత ఈ సంస్థపై మోమన్ బాబు కొత్త కొత్త ఆరోపణలు చేయటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.