టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు.. నేడు దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి నాయుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టిన చంద్రబాబు.. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. రాష్ట్రం రెండుగా విడిపోయాక.. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కొనసాగారు.
చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్బంగా.. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఇలాగే పూర్తి ఆరోగ్యంతో, చిరకాలం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు సీఎం జగన్.