పాలు, పాల ఉత్పత్తులో ప్రసిద్ధి గాంచిన సంస్థ హెరిటేజ్. ఇప్పుడు ఈ సంస్థ మరో ఉత్పత్తితో మార్కెట్ లోకి వచ్చింది. ’గ్లూకో శక్తి‘ పేరిట 200 మిలీ ప్యాక్ తో ఎనర్జీ డ్రింక్ ను తీసుకువచ్చింది. సమ్మర్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రొడక్ట్ఖ్ ను విడుదల చేసింది. ఇందులో గ్లూకోజ్ శక్తి ఉండనుంది. దీని ధర కూడా రూ. 10. తెలంగాణా, ఆంధ్రపదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. సూపర్ మార్కెట్లు, హెరిటేజ్ పార్లర్లు, ఎంపికచేసిన రిటైల్ స్టోర్లలో ఇవి లభ్యమవుతాయని సంస్థ చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తెలిపారు. ఈ డ్రింక్ లో సోడియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి.
అలసట వచ్చినప్పడు తక్షణమే ఈ డ్రింక్ తాగితే, వెంటనే శక్తిని అందిస్తుందని సంస్థ నారా భువనేశ్వరి తెలిపారు. ప్రతి రోజూ, ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం సంతోషాన్ని అందజేయాలన్న వాగ్దానాన్నినిలబెట్టుకోవడానికి చేసిన మరో ప్రయత్నమే ఈ హెరిటేజ్ ఎనర్జీ డ్రింక్ . కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఎనర్జీ డ్రింక్ అందుబాటులో ఉండనుందని తెలిపారు. గతంలో హెరిటేజ్ ఫుడ్స్ క్రీమీలేషియస్ పెరుగు ని కూడా ఆవిష్కరించింది. తొలుత ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విడుదల చేయగా.. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మహారాష్ట్రలో ఈ పెరుగు లభ్యమౌతోంది. ఈ పెరుగు ఎలాంటి భోజనానికైనా ఆరోగ్యంగా, రుచికరంగా ఉంటుందని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు.
We also unveiled GlucoShakti, a whey-based instant energy drink that revitalizes our hardworking youth, when strenuous physical work drains them. GlucoShakti has the goodness of whey, fortified with Glucose for Instant Energy.#HeritageFoods #NutritionToNation #GlucoShakti pic.twitter.com/8GSS7wzRTS
— Heritage Foods (@hfltd) January 20, 2023