టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి మొన్న మంచు మనోజ్ వివాహం అంగరంగ వైభవంగా జరగ్గా..కుటుంబ సభ్యులంతా వచ్చి పాల్గొన్నారు. అయితే ఇందులో మంచు వారి పెద్దబ్బాయి విష్ణు, ఆయన భార్య వెరొనికా అతిధి పాత్ర పోషించారు. అదీ చర్చగా మారింది. అదీ అయిపోయిందీ అనుకునే లోపు అన్నదమ్ముల వివాదం బయటపడింది. ఇప్పుడు మరో వార్త నడుస్తోంది. అదీ ఏంటంటే..?
ఇటీవల మంచు మోహన్ బాబు కుటుంబం వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి మొన్న మంచు మనోజ్ వివాహం అంగరంగ వైభవంగా జరగ్గా..కుటుంబ సభ్యులంతా వచ్చి పాల్గొన్నారు. అయితే ఇందులో మంచు వారి పెద్దబ్బాయి మంచు విష్ణు, ఆయన భార్య వెరొనికా అతిధి పాత్ర పోషించారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఇది పెద్ద చర్చకు దారి తీసింది. అంతా హ్యాపీ అనుకునేలోగా ఎన్నడూ లేని విధంగా అన్నాదమ్ములు మంచు విష్ణు, మనోజ్ రోడ్డున పడ్డారు. మనోజ్ అనుచరుడిపై విష్ణు చేయి చేసుకోవడంతో ఆ ఘటనను మనోజ్ వీడియో తీసి సోషఃల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అంతలోనే మోహన్ బాబు కలగజేసుకుని వీడియో డిలీట్ చేయమని చెప్పడంతో.. మనోజ్ తీసేసినప్పటికీ.. నెటిజన్లు వదలడం లేదు. ఈ గొడవలతో మీమ్స్ రూపొందించి వైరల్ చేస్తున్నారు. ఇంతలోనే మంచు లక్ష్మి కుమార్తెకు ప్రమాదం అని వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలు రావడంతో దీనిపై మోహన్ బాబు ముద్దుల తనయ, మంచు లక్ష్మీ ప్రసన్న వివరణ ఇచ్చారు. ఈ యాక్సిడెంట్ జరిగి చాలా కాలం అయ్యిందని చెప్పారు. ఈ నెల 19న మంచు మోహన్ బాబు పుట్టిన రోజు పురస్కరించుకని పిల్లలంతా బగ్గీలో ప్రయాణిస్తుండగా.. అది ఒక్కసారి అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిందట. దాంతో పిల్లలు కిందపడిపోయారు. ఆ బగ్గీలో మంచు లక్ష్మీ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆమె పక్కకు దూకేయగా.. పిల్లలంతా రోడ్డుపై పడిపోయారు. పిల్లలకు ఏమైందని గట్టిగా అరుస్తూ వెళ్ల గా. . అప్పటికే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ (యాపిల్ ముద్దు పేరు) మొహం నిండా రక్తంతో కనిపించిందట. పాపని గుర్రపు బండి ఎక్కించుకాకుండా ఉంటె బాగుండేదని,. అలా చేయడం వల్ల పాపకు కుట్టు పడ్డాయి అని మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యారు. కుమార్తెతో కలిసి మంచు లక్ష్మి రకరకాల వీడియోలు చేస్తూ ఉంటారు. తన కూతురికి సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అయితే మోహన్ బాబు పుట్టిన రోజున జరిగిన ఈ యాక్సిడెంట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.