ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆయన తొలిసారి మీడియా ముందు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 చోట్లా టీడీపీ సత్తా చాటి.. వైసీపీకి షాక్ ఇచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించాని సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. తూర్పు రాయలసీమలో కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఇక పశ్చిమ రాయలసీమలో టీడీపీ స్వల్ప ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. అయితే ఈ మూడు స్థానాల ఫలితాలు అధికార పార్టీకి చెంప పెట్టులాంటివని ప్రతిపక్ష పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పట్టభద్రలు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓట్ల బండిల్ లో ఏదో తేడా జరిగిందంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
ఏపీలో జరిగిన మూడు పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీకి ఊహించని ఎదురెబ్బ తగిలింది. ఇప్పటికీ రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. మరో స్థానంలో స్వల్ప ఆధికంలో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ నేతలు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందనటానికి ఈ ఫలితాలే నిదర్శనమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఫలితాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓట్ల బండిల్ ఏదో తేడా జరిగిందని, అలానే కౌంటింగ్ లో జరిగిన అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని సజ్జల అన్నారు.
ఇక ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఏదో మారిపోయిందని అనుకోవద్దని, తమ ఓటర్లు వేరే ఉన్నారని ఆయన తెలిపారు. లెఫ్ట్ పార్టీల ఓట్లు టీడీపీకి పడ్డాయని ఆయన తెలిపారు. ఇక్కడ ఓట్లు వేసింది సమాజంలోని చిన్న సెక్షన్ మాత్రమేనని, తొలిసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవడమే తమకు అతిపెద్ద విజయమని సజ్జల పేర్కొన్నారు. మరి.. సజ్జల చేసిన వ్యాఖ్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.